BigTV English

Ajith Kumar: వరేవ్వా తల… దుబాయ్ కార్ రేసింగ్‌లో అదరగొట్టిన అజిత్ టీమ్, ఏ స్థానంలో నిలిచారంటే…

Ajith Kumar: వరేవ్వా తల… దుబాయ్ కార్ రేసింగ్‌లో అదరగొట్టిన అజిత్ టీమ్, ఏ స్థానంలో నిలిచారంటే…

Ajit : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త ఏడాది ప్రారంభంతో సరి కొత్త విజయాన్ని అందుకున్నారు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవల ఓ రేసింగ్ టీమ్ ను ప్రకటించిన ఈ హీరో.. తాజాగా తన టీమ్ తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతున్న కార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో అజిత్ మూడో స్థానానికి కైవసం చేసుకున్నారు.


24H దుబాయ్ కార్ రేసింగ్ పేరుతో దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇటీవలే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొన్నారు.

అటు సినిమాలతో పాటు ఇటు కార్ రేసింగ్ లో సైతం సత్తా చాటుతున్నారు కోలీవుడ్ హీర్ అజిత్. రేసింగ్ ను ఎంతగానో ఇష్టపడే అజిత్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు హైవేలపై ఎంతో దూరం బైక్స్ పై ప్రయాణం చేసేశారు. అంతే కాకుండా ఇలా రేసింగ్ అంటే ఇష్టం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ను సైతం క్రియేట్ చేశారు. ఇందులో అజిత్ తో పాటు ట్రెక్కింగ్, రేసింగ్ కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ అవ్వొచ్చు. వీరందరికీ ఆయనే స్వయంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు.


కార్లతో పాటు బైక్ రేసింగ్ ఎంతగానో ఇష్టపడే అజిత్ దాదాపు 13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఈ రేస్ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలే అజిత్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదానికి గురయ్యింది. ప్రాక్టీస్ సమయంలోనే కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి గట్టిగా గోడను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం డామేజ్ అయినప్పటికీ అజిత్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఫుల్ ఎనర్జీతో అజిత్ తన టీమ్ తో కలిసి ఇండోరెన్స్ రేస్ లో పాల్గొన్నారు. ఇందులో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక అజిత్ సాధించిన ఈ విజయంతో ఆయన టీం శుభాకాంక్షలు తెలుపుతుంది. అభిమానులతో పాటు ఫాలోవర్స్, రేసింగ్ లవర్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అజిత్‌ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా వేస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది. ఇది కాకుండా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలోనూ అజిత్ నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సిన. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 10న ఇది విడుదల కానుంది.

ALSO READ : మరోసారి చిక్కుల్లో పడిన హనీరోజ్.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×