Harish Rao press meet: రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో హరీష్ రావు మీడియా ప్రెస్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయక.. డెైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కార్ చేసే పనులన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని.. త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. రైతు భరోసా రూ.15,000 ఇస్తానని చెప్పి రూ.12వేలు ఇవ్వడం రైతులను మోసం చేయడమేని అని చెప్పారు. ‘రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇవ్వాలి. కోటి మంది వ్యవసాయ కూలీలకు రూ.12వేల చొప్పున ఇవ్వాలి. పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయాలి. కౌలు రైతులకు బోనస్ వర్తింప జేయాలి. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఈ ఐదు డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి’ అని హరీష్ రావు సవాల్ విసిరారు.
‘మేం కొత్త కోరెకలు ఏం కోరడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చితే చాలు. రైతులు మీకు మళ్లీ బుద్ది చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని వర్గాల ప్రజలను మోసం చేసింది. హింస రాజకీయాలు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ముషీరాబాద్ లో దాడి, అల్లు అర్జున్ ఇంటిపై దాడి, నాపై దాడి, బీఆర్ఎస్ ఆఫీస్‌లపై దాడులు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సంక్షేమంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి.. శాంతి భద్రత సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. పత్రిపక్ష నాయకులపై దాడి జరుగుతున్నా.. పోలీసులు చూస్తేనే ఉన్నారు. సీఎం దాడులను ప్రోత్సహిస్తున్నారు’ అని హరీష్ రావు అన్నారు.
Also Read: RBI Recruitment: RBIలో జాబ్స్.. వీరందరూ అర్హులే..!! జీతం రూ.80,000
సీఎంకు రాష్ట్రం కంటే రాజకీయం ముఖ్యమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదు. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ దందాలు గురించి అడిగితే గుండాయిజం చేస్తున్నారు. రాష్ట్రంలో మతకలహాలు పెరిగిపోయినయ్. ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచిది కాదు’ అని హరీష్ రావు హెచ్చరించారు. హోంమంత్రి గా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారని, ఆయన మోసంతో దాడుల వెనుక ఆయన హస్తం ఉందని ప్రజలకి అనుమానం కలుగుతోందన్నారు. ప్రజా పాలన కేవలం పేపర్ పై ఉంది ప్రతీకార పాలన రాష్ట్రంలో నడుస్తుందన్నారు. సీఎం ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ఠలా మార్చేశారని, ఆరు గ్యారెంటీల గురించి అడిగితే మాపై దాడులు చేయిస్తారా..? అని హరీష్ రావు ఫైర్ అన్నారు. పోలీసులను ప్రతిపక్షం చుట్టే తిప్పడం వల్ల తెలంగాణలో 23 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ ఈ హింస రాజకీయాలు వెంటనే ఆపాలి అని అన్నారు. కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దాడులపై జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.