Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఆ వివరాలు చూద్దాం
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్…
గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ను నెలకొల్పింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో మే 8 నుండి స్ట్రీమింకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. థియేటర్లలో సునామీ సృష్టించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మే 8న స్ట్రీమింగ్ అయి ఎటువంటి రికార్డ్స్ ను తిరగరాస్తుందో చూడాలి.
కధ ఇలా సాగుతుంది ..
రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే(అజిత్ ) గ్యాంగ్స్టర్ ఎన్నో సంవత్సలుగా చీకటి సామ్రాజ్యానికి డాన్ గా వ్యవహరిస్తుంటాడు. అతను తన భార్య రమ్య(త్రిష) చెప్పినట్లు.. ఆమె కోసం రౌడీ ఇజం వదిలేసి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్లు జైల్లోనే గడిపి ఆ తర్వాత స్పెయిన్ లో ఉన్న తన కొడుకుని చూడడానికి, తన భార్యతో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ టైంలో అతనికి అనేక సమస్యలు ఎదురవుతాయి.. వాటన్నిటినీ ఎలా ఎదుర్కొన్నాడు, తన కొడుకుని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తే, ఎలా కాపాడుకున్నాడు అనేదే సినిమా కథ. ఈ చిత్రం ఊహించని ట్విస్టులతో, యాక్షన్స్ సన్నివేశాలతో ఆకట్టుకుంది.
భారీ బడ్జెట్ మూవీ …ఆ ఓటీటీ లో ..
ఈ ఏడాది అజిత్ కి బాగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. విడాముయార్చి సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అజిత్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇక గుడ్ బాడ్ అగ్లీ మైత్రేయి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ సీన్స్ కి ఎక్కువ బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని 300 థియేటర్లలో రిలీజ్ చేశారు. అజిత్ ఫ్యాన్ బేస్, కోలీవుడ్ లో ఆయన క్రేజ్ తో చిత్రం బ్లాక్ బాస్టర్ రికార్డుని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సునీల్, అర్జున్దాస్, యోగిబాబు, ప్రియా వారియర్ కీలక పాత్రలో కనిపించారు. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మే 8న స్ట్రీమింగ్ కానుంది.