BigTV English

India : పాకిస్తాన్ వెళ్తా.. ఆత్మాహుతి దాడి చేస్తా.. మంత్రి వీడియో వైరల్

India : పాకిస్తాన్ వెళ్తా.. ఆత్మాహుతి దాడి చేస్తా.. మంత్రి వీడియో వైరల్

India : పహల్గాం ఉగ్రదాడి తర్వాత యావత్ భారత్ రగిలిపోతోంది. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ పట్టుబడుతోంది. పీవోకేను స్వాధీనం చేసుకునే వరకూ ఊరుకోం అంటున్నారు. కనీసం సర్జికల్ స్ట్రైక్స్ అయినా చేయాల్సిందే అనేది మనోళ్ల డిమాండ్. మోదీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా? పాక్‌కు ఎలాంటి బుద్ధి చెబుతారా? అని 140 కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ… ఆ ఒక్కడు మాత్రం అలా కాదు. అందరికంటే సంథింగ్ డిఫరెంట్.


వారెవా.. క్యా బాత్ హై

నాకో బాంబ్ ఇవ్వండి.. నేను పాకిస్తాన్ వెళ్తా.. అక్కడ ఆత్మాహుతి దాడి చేస్తా.. పాకిస్తానీయులను చంపేస్తా.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలా అన్నది ఏ యూట్యూబరో, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టో కాదు.. కర్నాటక రాష్ట్ర మంత్రి. కాంగ్రెస్‌కు చెందిన ముస్లిం నేత. అందుకే, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


వీడియో వైరల్

కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా అంగీకరిస్తే.. పాకిస్తాన్‌కు వెళ్లి తానే యుద్ధాన్ని స్టార్ట్ చేస్తానని అన్నారు. తనకు ఒక ఆత్మాహుతి బాంబు ఇవ్వండని అడిగారు. ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆ మాట అనగానే.. అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. వెంటనే ఆ మినిస్టర్ స్పందించారు. “మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నేనేమీ జోక్ చేయట్లేదు.. ఈ విషయంలో నేను చాలా సీరియస్‌గా ఉన్నా..” అంటూ కంటిన్యూ చేశారు. కర్నాటక మినిస్టర్ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

బీజేపీకి మైండ్ బ్లాక్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. కర్నాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్స్‌ను సైతం కాంట్రవర్సీ చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని.. యుద్ధం వల్ల ఇరువైపులా తీవ్ర నష్టం జరుగుతుందని సిద్ధరామయ్య అన్నారు. పాక్‌కు కాంగ్రెస్ సీఎం సపోర్ట్ చేస్తోందంటూ బీజేపీ శ్రేణులు రచ్చ చేశాయి. లేటెస్ట్‌గా అదే కర్నాటక మినిస్టర్ జమీర్ అహ్మద్ ఖాన్.. తానే ఆత్మాహుతి బాంబుగా మారి, పాకిస్తాన్ వెళ్లి, ఆ దేశంతో యుద్ధాన్ని స్టార్ట్ చేస్తానంటూ సీరియస్ నోట్‌లో మాట్లాడటంతో బీజేపీకి కంగుతిన్నంత పనైంది. అందులోనూ ఓ ముస్లిం నాయకుడు అలాంటి కామెంట్స్ చేయడం మరింత ఆసక్తికరం.

Also Read : పాక్‌పై త్రిశూల వ్యూహం.. బాహుబలి రేంజ్‌లో యుద్ధ సన్నాహం..

యుద్ధం ఉందా? లేదా?

దేశమంతా యుద్ధం యుద్ధం అంటుంటే.. కేంద్రం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. యుద్ధ సన్నాహాల్లో బిజీగా ఉంటోంది. పాకిస్తాన్‌ను అన్నివైపుల నుంచి దెబ్బ కొడుతోంది. పాక్ దిగుమతులను ఆపేసి ఆర్థికంగా అటాక్ చేసింది. సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకొని.. వాటర్ వార్ స్టార్ట్ చేసింది. టీవీలు, యూట్యూబ్ ఛానెళ్లు, పార్సిల్స్, పోస్టల్స్, మెయిల్స్.. ఇలా పాక్‌తో అసలెటువంటి సంబంధం లేకుండా చెక్ పెడుతోంది. ఇప్పటికే నేషనల్ హైవేపై ఫైటర్ జెట్స్ ట్రయల్ రన్స్ చేసింది. సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించింది. ఇక యుద్ధం ఒకటే మిగిలింది. అదెప్పుడు..?

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×