Iron Deficiency: తరచుగా అలసిపోయినట్లు అనిపించినా లేదా బలహీనంగా అనిపించినా కూడా మీరు మీ ఆరోగ్యం పట్ల కొన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. తల తిరుగుతున్నట్లు అనిపిస్తే.. ఏ విషయాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతే మీ జుట్టు, గోర్లు బలహీనంగా అనిపిస్తే మాత్రం మీరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అర్థం. మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. కానీ శరీరంలో ఐరన్ లోపిస్తే మాత్రం మీరు రక్తహీనతకు గురవుతారు. మీరు సప్లిమెంట్లు తీసుకోకుండానే ఐరన్ లోపాన్ని అధిగమించాలనుకుంటే.. మంచి ఆహారంతో పాటు.. కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించాలి.
ఐరన్ లోపం :
మన శరీరంలో ఐరన్ అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా.. పీరియడ్స్ సంబంధిత సమస్యలతో పాటు, ఎండోమెట్రియోసిస్ , మూత్రపిండాల వ్యాధి ప్రమాదం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు ఇది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా కారణమవుతుంది. అందుకే ఐరన్ లోపాన్ని అధిగమించడానికి.. మీరు మీ ఆహారంలో బ్రోకలీ, పాలకూర, సోయాబీన్, మునగ ఆకులు, గుడ్లు, ఎండుద్రాక్ష, గింజలు, ఆప్రికాట్లు, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు, బఠానీలు మొదలైన వాటిని చేర్చుకోవాలి.
అంతే కాకుండా మల్బరీ, ఉసిరి, నల్ల ద్రాక్ష వంటి పండ్లలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు.. ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకున్నప్పటికీ శరీరంలో ఐరన్ లోపం ఉంటుంది. ఎందుకంటే శరీరం ఐరన్‌ను పూర్తిగా గ్రహించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయుర్వేదం మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
దేశీ నెయ్యి:
ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఆయుర్వేద నివారణలు పాటించాలి. మీరు ఐరన్ లోపంతో బాధపడుతుంటే.. భోజనానికి ముందు ఒక టీస్పూన్ ఉసిరి పొడిలో కాస్త స్వచ్ఛమైన నెయ్యి కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ భోజనానికి ముందు తినండి. దీనివల్ల ఐరన్ లోపం తొలగిపోతుంది.
ఈ ఆహారం తినకూడదు:
ఐరన్ లోపం ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్, టమాటోలు బంగాళదుంపలు, కాఫీ మొదలైన ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సులభమైన మార్గం ఎండిన అల్లం. మీరు మీ ఆహారం, టీ మొదలైన వాటిలో క్రమం తప్పకుండా ఎండిన అల్లంను చేర్చుకోవాలి.
Also Read: రాత్రి మిగిలిపోయిన రోటీలను ఉదయం తింటున్నారా ? అస్సలు అలా చేయొద్దు
ఈ ఔషధాలు వాడాలి :
ఆయుర్వేదంలో ఐరన్ లోపాన్ని సహజ పద్ధతిలో నయం చేసే అనేక మందులు ఉన్నాయి. వీటిలో ద్రాక్షారిష్ట కూడా ఒకటి. ద్రాక్షరిష్ట నల్ల ఎండుద్రాక్ష నుండి తయారైన శక్తివంతమైన పొడి. మీరు 15 మి.లీ. ద్రాక్షరిష్టను 15 మి.లీ. నీటిలో కలిపి భోజనం తర్వాత తీసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు తరచుగా అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడుతుంటే ద్రాక్షారిష్టను తినకూడదు. దీనికి బదులుగా.. ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షలను తినండి. నల్ల ద్రాక్ష తినడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది.