Akhanda 2 : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బోయపాటి కాంబోలో అఖండ 2 తాండవం రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ మూవీ ఓపెనింగ్ డే బాలయ్య తన పవర్ఫుల్ డైలాగ్ తో ఆడియన్స్‌ను మెస్‌మరైజ్ చేశాడు.. ఈ సినిమాలో డబుల్ మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఈ మూవీలో బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. బాలయ్య దేవాలయాల పవిత్రత కాపాడే ఒక పవర్ఫుల్ ఆఘోర పాత్రలో.. హిందూ దేవాలయాలు, గ్రంథాల జోలికి ఎవ్వరు వెళ్ళిన వాళ్ళ తాటతీసే తాండవం ఆడే వ్యక్తిగా కనిపించనున్నాడని సమాచారం. మొదటి భాగంలో కన్నా రెండో భాగంలో ఎక్కువగా మాస్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బాలయ్య కళ్ళల్లో కోపం శత్రువులు వణుకు పుట్టించేలా ఉంటుందని.. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ.. సినిమా రూపొందనుందని.. దీంతో పాటు ఓ పాన్ ఇండియన్ పాయింట్ కూడా బోయపాటి టచ్ చేయబోతున్నాడని టాక్.. అంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది..
ఇదిలా ఉండగా.. ఈ మూవీలో బాలయ్యతో ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇది నిజమైతే ఫ్యాన్స్ కు మాస్ జాతరే.. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈ అగ్ర హీరోలిద్దరు ఇంటర్వెల్ సమయంలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా చర్చలు కొనసాగిస్తున్నారు. బాలయ్య-పవన్ కాంబినేషన్‌లో తెరకెక్కే సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజులో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే బాగుండునని మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పనిచేస్తున్నారు.. ఇక గతంలో బోయపాటి – బాలయ్య కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. అ మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి ఇప్పుడు రాబోతున్న నాలుగో సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ వీ నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఏపీకి ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన సినిమాల్లో చురుగ్గా పాల్గొనలేదు.. అలాంటి పవన్ కళ్యాణ్ బాలయ్య సినిమాలో ఎలా చేస్తాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తలపై ఒక ప్రకటన రాబోతుందని సమాచారం..