BigTV English

Homemade Hair Mask: జుట్టు ఎక్కువగా రాలుతోందా ? అయితే వారానికోసారి ఇలా చేయండి

Homemade Hair Mask: జుట్టు ఎక్కువగా రాలుతోందా  ? అయితే వారానికోసారి ఇలా చేయండి

Homemade Hair Mask: వాయు కాలుష్యం ఈ రోజుల్లో తీవ్రమైన సమస్యగా మారింది. ఇది మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. కాలుష్యం కారణంగా, జుట్టు పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకునవాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఇవి మీ జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు రాలకుండా చేస్తాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా మారుస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టుపై వాయు కాలుష్యం ప్రభావం:


పొడిబారడం:  గాలిలో ఉండే హానికరమైన కణాలు జుట్టు యొక్క తేమను గ్రహిస్తాయి. ఫలితంగా జుట్టును పొడిగా, నిర్జీవంగా చేస్తాయి.

జుట్టు మూలాలు: కాలుష్యం జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

చుండ్రు: కాలుష్యం వల్ల స్కాల్ప్‌లో చికాకు, దురద వస్తుంది. దీని వల్ల చుండ్రు సమస్య పెరుగుతుంది.

జుట్టు రంగు క్షీణించడం: కాలుష్యం వల్ల జుట్టు రంగు మారుతుంది. తెల్ల జుట్టు రావడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి.

హెయిర్ మాస్క్‌లు జుట్టుకు పోషణ, బలోపేతం చేయడానికి ఒక సహజ మార్గం. ఈ మాస్క్‌లు జుట్టుకు తేమను అందించి, వాటిని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా చుండ్రు నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

అవకాడో , ఎగ్ హెయిర్ మాస్క్:
అవోకాడోలో విటమిన్ ఇ , హెల్తీ ఫ్యాట్‌లు ఉన్నాయి.ఇవి జుట్టుకు పోషణనిస్తాయి. గుడ్డు జుట్టును బలపరుస్తుంది. ఈ మాస్క్ చేయడానికి, ఒక పండిన అవకాడో గుజ్జు, ఒక గుడ్డు పచ్చసొనను తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

పెరుగు, తేనె హెయిర్ మాస్క్: పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది. తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా తేనెను తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

అవిసె గింజల హెయిర్ మాస్క్: అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టును మెరిసేలా చేస్తాయి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, 3 టీ స్పూన్ల అవిసె గింజలను నీటిలో ఉడకబెట్టండి. ఈ నీటిని చల్లార్చి జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

మెంతి గింజల హెయిర్ మాస్క్: మెంతి గింజల్లో ప్రొటీన్ , నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేస్తాయి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, 1 చిన్న కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో వేసి నానబెట్టండి. ఈ గింజలను ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఆమ్లా హెయిర్ మాస్క్: ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిలో తగినంత నీటిని కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Also Read: మహిళల్లో జుట్టు రాలడానికి కారణాలేంటో తెలుసా ?

ఈ చిట్కాలు కూడా మీకు సహాయపడతాయి:

కాలుష్యాన్ని నివారించడానికి, ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు స్కార్ప్ వాడండి

జుట్టును క్రమం తప్పకుండా వాష్ చేసుకోండి.

మీ జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌ను తక్కువగా ఉపయోగించండి.

జుట్టుకు తరుచుగా నూనె రాయండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

నీరు పుష్కలంగా త్రాగాలి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×