Actor Suman: తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా సుపరిచితుడైన సుమన్(Suman) .. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ తో పాటు మొత్తం పది భాషలలో నటించారు. ఐదు దశాబ్దాలలో 800 కు పైగా సినిమాలలో నటించిన సుమన్.. 1959 ఆగస్టు 28న జన్మించారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా తెలుగులో నటించిన చిత్రాల విషయానికొస్తే.. ‘అన్నమయ్య ‘ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర, ‘ శ్రీరామదాసు’ సినిమాలో రాముని పాత్ర మరుపురానివి. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయనకు.. 2021 లో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.
ఇక 1993లో కృష్ణంరాజు, జయసుధ ప్రధాన పాత్రలో నటించిన బావబామ్మర్ది చిత్రానికి గానూ నంది అవార్డును సైతం అందుకున్నారు. తుళు , ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగే ఈయన హెచ్ ఏ ఎస్ శాస్త్రి దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు. అలాగే వీణ, గిటార్లను కూడా వాయించగలరు. తొలుత తన జీవితాన్ని కరాటే మాస్టర్ గా ప్రారంభించిన ఈయన ఆ తరువాత ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుమన్ కి ‘ నటకేసరి ‘ అనే బిరుదు కూడా ప్రధానం చేశారు. హీరోగా ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ‘ సముద్రుడు ‘ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు సుమన్. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సుమన్ హీరోగా కెరియర్ పీక్స్ లో ఉండగానే ఒక కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై తాజాగా బిగ్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అసలు విషయంలోకి వెళితే.. పోర్న్ గ్రఫీ కేసులో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను అక్రమంగా ఇరికించినట్టు తేలడంతో నిర్దోషిగా బయటకు వచ్చారు. అప్పటికే హీరోగా ఆయనకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. తెలుగు, మిగతా దక్షిణాది పరిశ్రమల్లో కూడా ఈయన ఒక్కరే జైలు జీవితం గడపాల్సిన రావడం దురదృష్టకరం అని చెప్పవచ్చు.
అయితే ఈ విషయంపై ఆయనను ప్రశ్నించగా.. తనదైన శైలిలో సమాధానం తెలిపారు. ” మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా.. కర్మ రిటర్న్స్ అనేది కచ్చితంగా నమ్మే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మీ జీవితంలో నిజంగానే.. సినిమాల పట్ల ఏ మక్కువ లేకుండా దాదాపు పది భాషలలో 800లకు పైగా చిత్రాలలో నటించారు కదా.. ఆ సమయంలో.. మీపై కొంతమంది కక్ష గట్టి మీకు అన్యాయం చేశారు. వారికి కర్మ రిటర్న్స్ అయ్యిందా?” అండి అంటూ ప్రశ్నించగా .. సుమన్ మాట్లాడుతూ.. ” నేను చెప్పకూడదు కానీ.. ఆ సమయంలో చాలా దారుణంగా సఫర్ అయ్యాను” అంటూ జైలు జీవితం గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు సుమన్. “కర్మ సిద్ధాంతం అంటే మనం ఏమి చెప్పకూడదు. వాడు నాశనం అవ్వాలి, రోడ్డు మీదకు రావాలి ,కాళ్లు చేతులు విరిగిపోవాలి ..ఇలా ఏమీ చెప్పకూడదు. కర్మ సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు చేసింది తప్పా.. ఒప్పా.. నువ్వు చేసింది ఒప్పు.. కానీ నీకు జరిగింది తప్పు అన్నట్టు అయితే ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటే సమయం కచ్చితంగా వస్తుంది. ఎవరైతే నీకు అన్యాయం చేశారో కచ్చితంగా నీ కళ్ళముందే ఇంకో రూపంలో వారు బాధపడతారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆస్తుల విషయంలో కొడుకుల విషయంలో, కూతుర్ల విషయంలో ఇలా ఏదో ఒక విషయంలో కచ్చితంగా ఖర్మ అనుభవించి తీరుతారు” అంటూ తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చక్కగా వివరించారు.