Akanksha Sharma :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా 2024 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ ఇప్పటికీ కొనసాగుతోందనే చెప్పాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూటమి తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు, మేనమామకు సపోర్టుగా ప్రచారం చేయకుండా.. వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర రెడ్డి (Silpa Ravichandra Reddy) కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడమే అసలు వివాదానికి కారణమైంది. ఇక అప్పటినుంచి అల్లు వర్సెస్ మెగా అన్నట్టు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకుంటున్నారు. దీనికి తోడు రామ్ చరణ్ (Ram Charan).. అల్లు అర్జున్(Allu Arjun) ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అన్ ఫాలో చేయడంతో సరికొత్త అనుమానాలకు దారితీస్తోంది. ఇలాంటి సమయంలో విశ్వక్ సేన్ (Vishwak sen) తో కలిసి ‘లైలా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఆకాంక్ష శర్మ (Akanksha Sharma ) అల్లు అర్జున్ పేరు ఎత్తడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా చిరంజీవి..
అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో యంగ్ ప్రొడ్యూసర్ సాహూ గారపాటి(Sahoo garapati) నిర్మాణంలో వస్తున్న చిత్రం లైలా. ఇందులో తొలిసారి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేయడంతో కేవలం 18 ప్లస్ వాళ్లు మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు ఫిబ్రవరి 9న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా వచ్చారు. ఇది కూడా సినిమాకి కాస్త ప్లస్ కానుంది. ఇలాంటి సమయంలో ఆకాంక్ష శర్మ అల్లు అర్జున్ పేరు ఎత్తడంతో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ పేరు ఎత్తి.. మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ కి గురవుతున్న హీరోయిన్..
అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా హీరోయిన్ ఆకాంక్ష శర్మ కూడా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగానే సినిమాలో తన క్యారెక్టర్ గురించి తెలియజేసిన ఆకాంక్ష శర్మ, చివరిలో ర్యాపిడ్ ఫైర్ నిర్వహించగా.. అల్లు అర్జున్ గురించి కామెంట్లు చేసింది. ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా సౌత్, నార్త్ కు సంబంధించిన హీరోల గురించి ఒక మాటలో చెప్పాలని యాంకర్ అడగగా.. ఆకాంక్ష శర్మ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ పేరు చెప్పగానే గ్రేట్ డాన్సర్ అని చెప్పిన ఈమె, ఆ తర్వాత “పుష్ప – తగ్గేదేలే” అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా గొప్ప డాన్సర్ అని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలోని మెగా అభిమానులు దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు. అంటే రామ్ చరణ్ కంటే కూడా అల్లు అర్జున్ గొప్పోడా అంటూ విమర్శలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది
ఏది ఏమైనా ర్యాపిడ్ ఫైర్ ఈమె కొంప ముంచేలా ఉందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.