Great Khali: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ {డబ్ల్యూడబ్ల్యూఈ} లో భారతీయుల ప్రస్తావన వస్తే టక్కున గుర్తొచ్చే పేరు “ది గ్రేట్ ఖలీ”. దిలీప్ సింగ్ రానా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ది గ్రేట్ ఖలీ అంటే మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఖాళీ తండ్రి పేరు జ్వాలా సింగ్, అతని తల్లి పేరు తండి దేవి. వీరికి ఏడుగురు కొడుకులు. అందులో ఒకరు ఖలి. 2010లో ది గ్రేట్ ఖలీ అనే రింగ్ పేరుతో దిలీప్ సింగ్ రానా అరంగేట్రం చేశారు.
Also Read: Shubman Gill: సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్…చరిత్రలోనే తొలి ప్లేయర్ గా రికార్డు!
అప్పటినుండి తన పేరును అందరూ ది గ్రేట్ ఖలీ గానే గుర్తుపెట్టుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఖలి.. భారతదేశంలోనే కాకుండా విదేశాలలోనూ పేరుగాంచారు. ఆయన పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. అలాగే పలు ప్రకటనలలోనూ నటించారు. అయితే డబ్ల్యూడబ్ల్యూఈ కి గుడ్ బై చెప్పిన అనంతరం భారత్ కి తిరిగి వచ్చిన ఖలీ.. ప్రస్తుతం భారతదేశంలో రెజ్లింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. దాదాపు 7.1 అడుగుల ఎత్తు, 157 కేజీల బరువుతో చూస్తేనే ఎవరినైనా భయపెట్టేలా కనిపిస్తాడు ఖలి.
ఈయన డబ్ల్యూడబ్ల్యూఈ లో హండర్ టేకర్ కి ఓడించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఓసారి డబ్ల్యుడబ్ల్యుఈ లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా నిలిచాడు. అలాగే 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫెమ్ లో చోటు సంపాదించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించిన ఖలి.. పంజాబ్ పోలీస్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. ఇక 2022వ సంవత్సరం ఫిబ్రవరి 10న రాజకీయాలలోకి అడుగుపెట్టి.. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో బిజెపిలో చేరికయ్యాడు.
కానీ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం పంజాబ్ లోనే స్థిరపడ్డ ఖలి.. తనకి సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పలు వీడియోలను పెడుతూ రచ్చ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కూడా పాల్గొన్నారు ఖలీ. అక్కడ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. తన తోటి భక్తులతో కలిసి పుణ్య స్నానం ఆచరించారు.
ఆ సమయంలో తోటి భక్తులు అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కానీ అతడు ఏ మాత్రం అసహనానికి లోనవ్వకుండా వారితో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. ఇక తన కుంభమేళాకు రావడం ఇదే మొదటిసారి అని, అక్కడ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ…ఆసియాలో తొలి ప్లేయర్ !
అయితే తాజాగా ఖలీ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ కనిపించాడు. దీంతో ఖలి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బంక్ లో ఓ కాషాయ కండువా వేసుకున్న ఖలీ కారులో పెట్రోల్ కొట్టడం కనిపించింది. అయితే ఇది సరదాగా ఫ్యాన్స్ కోసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఖలి వీడియో చూసిన నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">