Akhil Akkineni: అక్కినేని కుటుంబానికి శాపమో.. వరమో తెలియదు కానీ.. వారందరికీ మొదటి పెళ్లి కలిసి రావడం లేదు. నాగార్జున దగ్గరనుంచి మొదలుపెడితే.. సుమంత్, సుప్రియ, నాగ చైతన్య.. చివరికి అఖిల్ కి కూడా మొదటి చూసిన సంబంధం సెట్ కాలేదు. నాగార్జున.. మొదట దగ్గుబాటి వారసురాలు లక్ష్మీని వివాహాం చేసుకున్నాడు. వీరికి నాగ చైతన్య జన్మించాడు. ఆ తరువాత వీరి మధ్య విభేదాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. లక్ష్మీ విడిపోయాక నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు అఖిల్ జన్మించాడు.
నాగార్జున తరువాత పెద్ద వారసుడు అక్కినేని నాగ చైతన్య. జోష్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ఈ కుర్ర హీరో ఏదోవిధంగా హీరోగా నిలదొక్కుకున్నాడు. అనంతరం హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరైనా కలిసి ఉంటారు అనుకుంటే.. నాలుగేళ్లు కూడా ఉండకుండా విడాకులు తీసుకొని విడిపోయారు. సామ్ తో విడాకుల తరువాత చైతన్య.. శోభితాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కూడా తండ్రి లాగానే కొడుకు అని విమర్శలు వచ్చాయి.
ఇక నాన్న, అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అఖిల్ కూడా రెండో సంబంధాన్నే పెళ్లి చేసుకున్నాడు. చై కన్నా ముందే అఖిల్.. శ్రేయా భూపాల్ ను ప్రేమించి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. అప్పట్లో వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి కొద్దిరోజుల్లో ఉంది అనగా వీరిద్దరి మధ్య ఏవో గొడవలు రావడంతో ఈ జంట పెళ్ళికాకముందు విడిపోయారు. ఇక ఇప్పట్లో ప్రేమ, పెళ్లి వద్దనుకున్న అఖిల్ కెరీర్ పైన ఫోకస్ పెట్టాడు. కానీ, ఒక్క మంచి హిట్ ను దక్కించుకోలేకపోయాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో ఒక మోస్తరు హిట్ ను అందుకున్నా.. హీరోగా తనకంటూ మంచి హిట్ మాత్రం ఇంకా దక్కలేదు. ఇక ఈలోపు అఖిల్ పెళ్లి కూడా జరిపించేయాలని నిర్ణయించుకున్న నాగ్.. చై పెళ్లిరోజే జైనబ్ తో అయ్యగారు రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అఖిల్ కన్నా జైనబ్ 9 ఏళ్లు పెద్దది. ప్రేమకు వయస్సుతో సంబంధం ఏం ఉంది అన్నట్లు.. ఈ జంటను అభిమానులు అంగీకరించారు.
ఇక అఖిల్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనుకుంటే చాలా సింపుల్ గా జరిగిపోయింది. అయితే అన్ని వేల కోట్లకు అధిపతి అయిన నాగ్ వారసుడి పెళ్లి ఎందుకు ఇంత సింపుల్ గా జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చింది లేదు. అంతెందుకు టాలీవుడ్ ఫిల్లర్స్ అయినా సీనియర్ హీరోలే ఈ పెళ్లికి హాజరుకాలేదు. సినీ, రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాగ్ పిలిచినా వారు రాకపోవడానికి కారణం ఏంటి అనేది తెలియదు. ఇక ఇదంతా పక్కన పెడితే.. అయ్యగారు తన పెళ్లిని ఇలా సింపుల్ గా చేసుకోవడానికి కారణం.. తన తల్లిదండ్రులను ఫాలో అవ్వడమే అని అంటున్నారు. నాగ్ – అమల పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగింది. తెల్ల దుస్తుల్లో నాగ్ – అమల ఎలా అయితే ఉన్నారో.. అఖిల్ – జైనబ్ కూడా సేమ్ దుస్తుల్లో కనిపించారు. ఒకవేళ అఖిల్.. తన తల్లిదండ్రుల్లానే పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉండొచ్చు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అప్పటి నాగ్ పెళ్లి ఫోటోని ఇప్పుడు అఖిల్ ఫోటోను పక్కపక్కన పెట్టి తండ్రీకొడుకులు సేమ్ టూ సేమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.