E-Paper
Advertisement

Mangalagiri: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..

Mangalagiri: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..
Advertisement

Mangalagiri: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎయిమ్స్, మంగళగిరిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌, మంగళగిరి(AIIMS Mangalagiri ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  పలు సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 117

ఇందులో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విభాగాలు: జనరల్ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనెటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఒబెస్ట్రిక్స్‌ & గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ & ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ & వ్యాస్క్యూలర్‌ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ & మెటబాలిజమ్‌, ఈఎన్‌టీ, ఫారెన్సిక్‌ మెడిసిన్‌ & టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌ మొదైలన విభాగాలు ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

సీనియర్ రెసిడెంట్ : 117 ఉద్యోగాలు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎంఎస్సీ, ఎంసీహెచ్‌ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 45 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.67,000 జీతం ఉంటుంది. నాన్ మెడికల్ అయితే రూ.56,100 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 14

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ALSO READ: SSC Recruitment: అద్భుత అవకాశం.. ఇంటర్ అర్హతతో ఎస్ఎస్‌సీలో ఉద్యోగాలు..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 117

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 14

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×