Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీలో కోడలుగా శోభిత (Sobhita Dhulipala) ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో గానీ, అప్పటి నుంచి అన్నీ శుభ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. స్వయంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నోటి నుంచి ఈ డైలాగ్ వచ్చిందంటే… ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అనే వార్త వినిపిస్తోంది. మరి అక్కినేని అఖిల్ (Akkineni Akhil) పెళ్లి ముహూర్తం ఎప్పుడు ? అనే వివరాల్లోకి వెళ్తే…
అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్
నాగ చైతన్య (Naga Chaiatanya), శోభిత ధూళిపాళ్ల జంట గత ఏడాది పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ‘తండేల్’ మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించింది. ఈ వరుస గుడ్ న్యూస్ లతో అక్కినేని ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఫ్యామిలీతో పాటు వారి అభిమానులను మరింత ఆనందాన్ని కలిగించే ఆహ్లాదకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది.
నాగచైతన్య తమ్ముడు, నటుడు అక్కినేని అఖిల్ రీసెంట్ గా జైనాబ్ రావ్జీ (Zainab Ravdjee)తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న అఖిల్, జైనాబ్ 2024 నవంబర్ 26న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వార్తని స్వయంగా నాగార్జున ప్రకటించారు.
ఇక తాజా సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ – జైనాబ్ 2025 మార్చి 24న పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. అక్కినేని నాగచైతన్య ఇలాగే అఖిల్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు.
గతంలో అఖిల్ ఎంగేజ్మెంట్ రద్దు
ఇక అఖిల్ కు గతంలోనే ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అఖిల్ తెరపై కనిపించి చాలా కాలమే అవుతుంది. ‘ఏజెంట్’ మూవీ ఇచ్చిన డిజాస్టర్ షాక్ తర్వాత అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం చాలా టైం తీసుకున్నాడు. ఆయన ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్ట్ లలో భాగం కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా అఖిల్ కొత్త ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
మరోవైపు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమా ‘తండేల్’. అంతేకాదు ఈ మూవీతోనే చై 100 కోట్ల క్లబ్ లో కూడా చేరడం విశేషం.