IRCTC టూర్ ప్యాకేజీ: శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు IRCTC ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ 4 రోజుల యాత్రలో శ్రీశైలం దర్శనంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలు మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామోజీ ఫిలిం సిటీని సందర్శించే అవకాశం కూడా ఉంది.
హైదరాబాద్, శ్రీశైలం మరియు రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు సూపర్ బడ్జెట్ ధరలలో ఈ టూర్ ప్యాకేజీని IRCTC ప్రారంభించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది, ఇందులో శ్రీశైలం దర్శనం కూడా ఉండడం ప్రత్యేకం. ఐఆర్‌సిటిసి ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని “Highlights of Hyderabad With Srisailam” (హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ శ్రీశైలం) పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియంతో పాటు రామోజీ ఫిలిం సిటీ సందర్శన ఉంటుంది.
మొదటి రోజు:
హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకుని హోటల్ కు తీసుకెళ్తారు. అదే రోజు చార్మినార్ మరియు సాలార్జంగ్ మ్యూజియం సందర్శన తర్వాత రాత్రికి హోటల్ కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం, బస హోటల్ లోనే ఉంటుంది.
రెండవ రోజు:
హైదరాబాద్ నుంచి శ్రీశైలం యాత్ర ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 5 గంటలకే హోటల్ నుంచి బయల్దేరుతారు. ఈ ప్రయాణంలో టిఫిన్ ఖర్చులు ప్రయాణికులు స్వయంగా చెల్లించుకోవాలి. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లికార్జున స్వామిని దర్శించుకుని, సమయం ఉంటే సమీప ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రాత్రికి హైదరాబాద్ చేరుకుని భోజనం హోటల్ లోనే చేసి అక్కడే చేయాలి.
Also Read: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సిటిసి ఆఫర్!
మూడవ రోజు:
హోటల్ లో ఉదయం అల్పాహారం తర్వాత రామోజీ ఫిలిం సిటీకి బయల్దేరుతారు. రోజంతా అక్కడ గడిపిన తర్వాత రాత్రికి హోటల్ కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం మరియు బస హోటల్ లోనే ఉంటుంది.
నాలుగవ రోజు:
ఈ రోజు టూర్ లో చివరి రోజు. ఉదయం అల్పాహారం తర్వాత లగేజీ సర్దుకుని బిర్లా మందిర్ దర్శనం చేసుకుంటారు. తర్వాత గోల్కొండ కోట మరియు కుతుబ్ షాహీ టోంబ్స్ సందర్శించి, సాయంత్రానికి హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు:
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ. 36,270
డబుల్ ఆక్యుపెన్సీ: రూ. 19,070
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ. 14,570
5-11 ఏళ్ల పిల్లలకు: రూ. 9,590
ప్యాకేజీలో ఇవి ఉన్నాయి:
3 రాత్రి భోజనాలు, 2 ఉదయం అల్పాహారాలు
హైదరాబాద్ లో హోటల్ సెంట్రల్ కోర్టు లేదా ఆదిత్య హోమ్ టెల్ లో ఏసీ అకామడేషన్
ఏసీ వాహనం మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్
బుకింగ్ కోసం:
ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి IRCTC టూరిజం వెబ్‌సైట్ లో లాగిన్ అవ్వాలి. మరిన్ని వివరాల కోసం 8287932229 / 8287932228 నెంబర్లకు కాల్ చేయండి. హైదరాబాద్, శ్రీశైలం యాత్రకు సంబంధించిన మరిన్ని ప్యాకేజీలు కూడా IRCTC ద్వారా అందుబాటులో ఉన్నాయి.