BigTV English

Akhil New Movie : అఖిల్ తో పుష్ప హీరోయిన్ రొమాన్స్… నాగ చైతన్యతో కూడా

Akhil New Movie : అఖిల్ తో పుష్ప హీరోయిన్ రొమాన్స్… నాగ చైతన్యతో కూడా

Akhil New Movie : ‘ఏజెంట్’ మూవీతో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత అక్కినేని అఖిల్ (Akhil Akkineni) వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆయన తన నెక్స్ట్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ‘పుష్ప 2’ హీరోయిన్ అక్కినేని అఖిల్ తో రొమాన్స్ చేయబోతుందనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే అఖిలతో పాటు నాగచైతన్యతో కూడా ఆమె జోడి కట్టబోతోందని తెలుస్తోంది.


అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కొత్త మూవీ కోసం అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఏజెంట్’ తరువాత ఇన్నాళ్ళూ ఆజ్ఞతవాసంలో ఉన్న అఖిల్ అరుదుగా మాత్రమే బయట కన్పించాడు. రీసెంట్ గా తన ఎంగేజ్మెంట్, నాగ చైతన్య (Naga Chaitanya) పెళ్లిలో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేయబోయే కొత్త సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ డైరెక్టర్ మురళి కిషోర్ అల్లూరి దర్శకత్వం వహించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇందులో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) అఖిల్ తో రొమాన్స్ చేయబోతుందని తెలుస్తోంది. కేవలం అఖిల్ తో మాత్రమే కాదు ఆయన సోదరుడు నాగ చైతన్యతో కూడా నటించే ఛాన్స్ ను శ్రీలీల కొట్టేసిందని ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 4 న శోభిత ధూళిపాళ్లతో పెళ్లి బంధంతో ఒక్కటైన నాగ చైతన్య చిన్న బ్రేక్ లో ఉన్నారు. ‘తండేల్’ చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ  సినిమా తర్వాత మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు చై.


కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ అడ్వెంచర్ ఎంటర్టైనర్ లో నాగ చైతన్య సరికొత్త పాత్ర చేయబోతున్నారు. ఈ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీలీల (Sreeleela) నాగ చైతన్యతో కూడా రొమాన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

రీఎంట్రీ తర్వాత శ్రీలీల (Sreeleela) మరోసారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2’లో పాటతో అదరగొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అఖిల్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ వంటి ప్రముఖులతో జోడి కట్టబోతోంది. టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది శ్రీలీల. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. దిలేర్, మిట్టి అనే టైటిల్స్ తో ఆ సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ‘దిలేర్’ సినిమా ఒక మార్తాండ్ రన్నర్ కు సంబంధించిన స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఇబ్రహీం అలీ ఖాన్ తో శ్రీలీల కలిసి కనిపించబోతోంది. ఇక ‘మిట్టి’ మూవీ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×