IND vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా జరుగుతోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ముగిశాయి. ఇక శనివారం రోజు {IND vs AUS} మూడవ టెస్ట్ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన కాసేపటికే వర్షం కారణంగా తొలిరోజు ఆటను రద్దు చేశారు అంపైర్లు. అయితే అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత పాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ – ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావీస్ హెడ్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.
Also Read: IND vs Aus 3rd Test: 76 ఓవర్లు వృధా…తొలి రోజు ఆట రద్దు..!
140 పరుగులు చేసిన హెడ్ ని సిరాజ్ యార్కర్ తో క్లీన్ బోల్డ్ చేశాడు. ఆ సమయంలో ట్రావిస్ హెడ్ వైపు చూస్తూ సిరాజ్ చాలా కోపంగా పెవిలియన్ కి వెళ్లాలంటూ సైగలు చేశాడు. దాంతో హెడ్ కూడా సిరాజ్ కి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ {IND vs AUS} రెండవ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం మహమ్మద్ సిరాజ్ – ట్రావిస్ హెడ్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కానీ వీరి గొడవ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మందలించే వరకు వెళ్లింది.
సిరాజ్ ఐసీసీ ప్రవర్తన నియమావళి లోని ఆర్టికల్ 2.5 ని ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 % జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ వివాదానికి సంబంధించి ఇద్దరు ఆటగాళ్లకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. కానీ హెడ్ కి ఆర్థికంగా జరిమానా విధించలేదు. {IND vs AUS} మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ గొడవ గురించి హెడ్ మీడియా ముందు మాట్లాడుతూ.. సిరాజ్ ని తాను ఏమీ అనలేదని, కేవలం బాగా బౌలింగ్ చేశావని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు. కానీ సిరాజ్ మాత్రం హెడ్ అబద్ధం చెబుతున్నాడని ఆరోపించాడు.
ఇక శనివారం భారత్ – ఆసీస్ మధ్య బ్రిస్బెన్ వేదికగా ఉదయం 5:50 గంటలకు 3వ టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మూడవ టెస్ట్ లో ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ పెసర్ మహమ్మద్ సిరాజ్ కి ఘోర అవమానం ఎదురైంది. ఆస్ట్రేలియా బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ లో మహమ్మద్ సిరాజ్ ని ఆస్ట్రేలియా అభిమానులు గేలి చేశారు.
Also read: Shakib AL Hasan: షకీబ్ అల్ హసన్ కి షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్.. ఇకపై అతను బౌలింగ్ చేయకూడదు!
మహమ్మద్ సిరాజ్ ని టార్గెట్ చేసి.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. కానీ సిరాజ్ మాత్రం వారి కామెంట్స్ ని పట్టించుకోకుండా తన బౌలింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఇక నేడు ఉదయం 5:50 కి ప్రారంభమైన 3వ టెస్ట్ కి వర్షం అంతరాయం కలిగించింది. అంపైర్లు తొలిరోజు శనివారం ఆటని రద్దు చేసే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 19*, నాథన్ మెక్ 4* పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు.