Akira Nandan Debut Movie :సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న తర్వాత, వారి వారసుల ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ముఖ్యంగా అభిమాన హీరోలకు వారసులు ఉన్నారంటే చాలు.. కనీసం చైల్డ్ ఆర్టిస్ట్ గా అయినా సరే ఇండస్ట్రీ లోకి రావాలని అభిమానులు పరితపిస్తారు. ఇక యుక్త వయసుకు వచ్చారు అంటే హీరోగా ఎప్పుడు లాంచ్ కాబోతున్నారు అని, హీరో కనిపించిన ప్రతిసారి కూడా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి అటు హీరోలు కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు.
ఖుషీ 2 తో అకీరా నందన్ ఇండస్ట్రీ ఎంట్రీ..
ఈ క్రమంలోనే గత రెండు, మూడు సంవత్సరాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడు అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒక సినిమా ద్వారా అకీరా ఎంట్రీ ఇస్తారు అనే వార్తలు వినిపిస్తున్నా.. ఇందులో ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అభిమానుల కోసం తాజాగా గుడ్ న్యూస్ చెప్పే ఒక వార్త తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన సినిమా ‘ఖుషీ’. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తోనే అకీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన మూవీ..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ అయిన ఎస్.జె.సూర్య(SJ.Surya) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ హీరోయిన్ భూమిక (Bhoomika Chawla) జంటగా వచ్చిన చిత్రం ఖుషీ. క్లాసిక్ మూవీ గా ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు మళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాంటి ఈ సినిమా సీక్వెల్ తో ఇప్పుడు ఆయన కొడుకు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
క్లారిటీ ఇచ్చిన ఎస్.జె.సూర్య..
అయితే ఈ విషయాన్ని స్వయంగా ఖుషీ డైరెక్టర్ ఎస్ జె సూర్య ఇటీవల జనవరి 4వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వెల్లడించారు. ” అకీరా నందన్ గనుక ఒకే చెబితే ఆయనతో ఖుషీ 2 సినిమా చేస్తాను” అని వెల్లడించారు ” ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి సగం నా కలను నెరవేర్చుకున్నాను. త్వరలోనే ఆ సగం కలను కూడా నెరవేర్చుకుంటాను” అని చెప్పడంతో ఇక అకీరా నందన్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్న అకీరానందన్ నటనకు సిద్ధం అయితే ఇక త్వరలోనే ఆయనతో సినిమా చేయడానికి ఎస్ జె సూర్య సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి శుభవార్త అని చెప్పవచ్చు. మరొకవైపు అకీరా నందన్ తల్లి రేణూ దేశాయ్ (Renudesai) కూడా అకీరా ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనా ఈ సంఘటన జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నా