BigTV English

Pushpa 2 Collections :బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప2.. ఎన్నో స్థానం అంటే..?

Pushpa 2 Collections :బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప2.. ఎన్నో స్థానం అంటే..?

Pushpa 2 Collections :పుష్ప-2.. మూడేళ్ల నిర్విరామ కష్టం తర్వాత భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన గత ఏడాది విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఏ లెవెల్ లో చేశారో.. సినిమా అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విడుదలైన సినిమాలన్నింటిలో మన సౌత్ ఇండియా నుండి ‘పుష్ప-2’ సినిమానే అన్ని రికార్డుల్లో ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘దంగల్’ సినిమా తర్వాత ఇండియన్ హిస్టరీ లోనే అన్ని కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. అంతేకాదు బాహుబలి 2(Bahubali 2)రికార్డ్ ని కూడా పుష్ప -2 ఒంటి చేత్తో వెనక్కి నెట్టింది. మరి ఇంతకీ పుష్ప-2 సాధించిన ఆ ఘనత ఏంటి..?బాహుబలి 2 ను ఏ విషయంలో వెనక్కి నెట్టింది? అనేది ఇప్పుడు చూద్దాం..


మొదటి రోజు నుండే రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప2..

సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో, అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న భారీ అంచనాలతో విడుదలైంది. బెనిఫిట్ షో తోనే సినిమా ఏ లెవెల్ లో ఉందో అర్థమైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ రోజే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజే దాదాపు రూ.300 కోట్లు అంటే సినిమా ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పుష్ప-2 మూవీ ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది..


బాహుబలి 2 ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2..

అయితే తాజాగా బాహుబలి 2 మూవీని కలెక్షన్లలో వెనక్కి నెట్టాడు పుష్ప రాజ్. ఇప్పటివరకు మన ఇండియాలో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా అమీర్ ఖాన్(Aamir Khan) ‘దంగల్’ మూవీ దాదాపు రూ.2000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో.. ప్రభాస్ (Prabhas) హీరోగా చేసిన ‘బాహుబలి 2’ మూవీ రూ.1810 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే తాజాగా బాహుబలి 2 మూవీ రికార్డుని పుష్ప-2 మూవీ వెనక్కి నెట్టేసింది. ఇప్పటి వరకు పుష్ప -2 మూవీ 32 రోజుల్లోనే దాదాపు రూ.1831 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ ని పక్కకు నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రెండో స్థానం..

అలా అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో దంగల్ మొదటి స్థానంలో ఉండగా.. పుష్ప-2 రెండో స్థానం సంపాదించుకుంది. ఇక ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇదే స్పీడ్ లో దంగల్ మూవీ రికార్డును కూడా వెనక్కినెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పుష్ప-2 సినిమా ఎన్ని రికార్డులు సాధించినా కూడా అల్లు అభిమానుల్లో ఎక్కడో కాస్త అసహనం అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం బాధాకరం. అలాగే ఈ కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడం కూడా జరిగింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×