EPAPER

Bigg Boss 8 Telugu: మరోసారి మణికంఠకు అన్యాయం.. ఎక్కడ ఉన్నా తనకు ఈ కష్టాలు తప్పవా?

Bigg Boss 8 Telugu: మరోసారి మణికంఠకు అన్యాయం.. ఎక్కడ ఉన్నా తనకు ఈ కష్టాలు తప్పవా?

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ఎంటర్ అవ్వడానికి 12 మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ 12 మందిని హౌస్‌లోకి రానివ్వకుండా చేయడం కోసం ఇప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా టాస్కులు ఆడాలి. అవే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. కొత్తవాళ్లను హౌస్‌లోకి రానివ్వదు.. వాళ్ల వల్ల పాతవాళ్లు హౌస్‌లో నుండి పోకూడదు. ఇదే కాన్సెప్ట్. ఇక ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులు గతవారం నుండి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో మరో మూడు టాస్కులు జరిగాయి. వేరే టీమ్‌కు వెళ్తే తనకు గుర్తింపు వస్తుంది అనుకున్న మణికంఠ మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.


గెలిచినవారికే లాభం

సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కులు ఇంకా అయిపోలేదు అని బిగ్ బాస్ ప్రకటించగానే హౌస్‌మేట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఇంకొక మాట కూడా చెప్పారు. ఈసారి ఈ ఛాలెంజ్‌లో గెలిచిన టీమ్‌కు లాభాలు ఉంటాయనే విషయం మర్చిపోవద్దని గుర్తుచేశారు. దీంతో ఇప్పటివరకు హౌస్ గురించి, వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఆలోచించిన సీత అండ్ టీమ్.. ఇప్పుడు టీమ్ గెలుపు కోసం, స్వార్థం కోసం ఆలోచించడం మొదలుపెట్టింది. అంతే కాకుండా గెలిచిన టీమ్ వల్ల ప్రైజ్ మనీ కూడా పెరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇప్పటినుండి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ గెలిచిన ప్రతీసారి ప్రైజ్ మనీలో రూ.1,50,000 యాడ్ అవుతాయని అన్నారు.


Also Read: సోనియాకు కాబోయే భర్త నాకు ఫోన్ చేశాడు.. బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్స్‌పై శేఖర్ భాషా కామెంట్స్

యష్మీ గెలుపు

ముందుగా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో దూకి తాళం వేసుకున్న టైర్లను పైకి తీసుకురావాలి. ఈ టాస్క్ కోసం విష్ణుప్రియా, నిఖిల్ రంగంలోకి దిగారు. విష్ణుప్రియా మాత్రం చాలా ఆలస్యంగా ఆట మొదలుపెట్టింది. నిఖిల్ చివరివరకు వచ్చినా చివర్లో ఓడిపోయాడు. దీంతో ఒక వైల్డ్ కార్డ్ సభ్యుడు హౌస్‌లోకి రావడానికి ఎంట్రీ క్లియర్ అయ్యింది. ఇక రెండో టాస్క్‌లో ఒక కర్రపై నిలబడి దానిని బ్యాలెన్స్ చేస్తూ అవతల వైపు ఉన్న బాస్కెట్‌లో బాల్స్ వేయాలి. ఆ టాస్క్ ఆడడానికి మణికంఠ, యష్మీ ముందుకొచ్చారు. ఇందులో యష్మీ గెలవడంతో ప్రైజ్ మనీలో రూ.1,50,00 యాడ్ అయ్యింది, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపింది. అంతే కాకుండా సీత టీమ్ ఓడిపోయింది కాబట్టి వారి టీమ్ నుండి ఒక సభ్యుడిని తొలగించాలని బిగ్ బాస్ ఆదేశించారు.

అదే చాలు

సీత టీమ్ నుండి ఎవరిని తొలగించాలి అని చర్చలు మొదలయ్యాయి. తన టీమ్‌లో ఉన్నవారందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. కాబట్టి ఆడడానికి ఛాన్స్ రానివారికి ఛాన్స్ ఇవ్వాలని కొందరు సభ్యులు అన్నారు. నైనికా, ప్రేరణ, సీత నుండి ఎవరైనా తప్పుకుంటే బాగుంటుందని భావించారు. కానీ చివరికి మణికంఠనే టీమ్ నుండి తీసేశారు. నబీల్.. మణికి ఎంత సపోర్ట్ చేయాలని ప్రయత్నించినా ఎవరూ తన మాట వినలేదు. దీంతో సీత టీమ్‌లో గుర్తింపు వస్తుంది అనుకున్న మణికంఠకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దానికి తను ఎంతో ఫీల్ అయ్యాడు. కానీ ఒక్క టాస్క్ అయినా ఆడాను కదా చాలులే అని తృప్తిపడ్డాడు.

Related News

Bigg Boss 8 Day 38 Promo 1: మైక్ విసిరేసిన గౌతమ్ కృష్ణ.. షాక్ లో కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. యష్మీ కొంచెం కూడా బుద్ది లేదా?

Bigg Boss 8 : హౌస్ లో ఎలిమినేషన్ స్కాం… నిజాన్ని బట్ట బయలు చేసిన సోనియా..

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు వరుడు కావలెను.. ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ దిమ్మదిరిగే ట్విస్ట్

Shilpa Shirodkar: మహేశ్‌, నమ్రతతో విభేదాలు… అందుకే మహేష్ మరదలు నుంచి ఆ కామెంట్స్

Bigg Boss: ముగిసిన నామినేషన్స్.. ఓటింగ్ లో ఆమె లీస్ట్..!

Bigg Boss 8: అడుగుపెట్టిన 24 గంటల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేట్.. బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్

×