BigTV English

Akkineni family: అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం.. ఖుషీలో ఫ్యాన్స్..!

Akkineni family: అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం.. ఖుషీలో ఫ్యాన్స్..!

Akkineni family:అక్కినేని నాగచైతన్య తన భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి, పెళ్లి చేసుకొని క్యూట్ కపుల్ గా ఇండస్ట్రీలో పేరు కూడా సొంతం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన నాలుగేళ్లకే విడిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే నాగచైతన్య(Naga Chaitanya) సమంత (Samantha) విడాకుల తర్వాత ఆ కుటుంబంలో సంతోషం అనేదే లేకుండా పోయిందని అభిమానులు ఎప్పుడూ బాధపడుతూ వుంటారు. దీనికి తోడు అక్కినేని హీరోలు నటించిన ఏ సినిమా కూడా పెద్దగా వారికి సక్సెస్ ను అందించలేదు. అలా తమ అభిమాన హీరో కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని అనుకునే లోపే అనూహ్యంగా నాగచైతన్య.. శోభిత(Shobhita )ని ప్రేమించడం, గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోవడం, డిసెంబర్లో వివాహం కూడా చేసుకోవడంతో అటు అక్కినేని కుటుంబంలోనే కాదు ఇటు అక్కినేని అభిమానులలో కూడా సంతోషం వెళ్లి విరిసింది.


త్వరలో అక్కినేని ఇంట పెళ్లి భాజాలు..

దీనికి తోడు ఈ ఏడాది నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇలా వరుస సంతోషాలు అక్కినేని కుటుంబాన్ని తలుపు తడుతున్నాయి. ఇక ఇంతలోనే మరో గుడ్ న్యూస్ తో అక్కినేని ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అదేంటంటే అక్కినేని అఖిల్ (Akkineni Akhil) పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు సమాచారం. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ గా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ కూడా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఇక ఆమె ఎవరో కాదు జైనాబ్ రవ్డ్ జీ (Zainab Ravdjee). హైదరాబాదులోని నాగార్జున(Nagarjuna) ఇంట్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని కూడా అక్కినేని నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.


అఖిల్ – జైనాబ్ ల పెళ్లి ఫిక్స్..

అయితే ఇప్పుడు అఖిల్, జైనాబ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2025 మార్చ్ 24న అఖిల్ మూడు ముళ్ళు ఏడడుగులతో కొత్త బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరుపుకొని, తేదీని కూడా ఫిక్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అఖిల్, జైనాబ్ ల వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు నాగార్జున పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్స్ ను కూడా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ ” లో బిజీగా ఉన్నారు. అంతేకాదు త్వరలోనే కొత్త సినిమాలు కూడా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున కెరియర్..

ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగార్జున స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. అటు బాలీవుడ్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నాగార్జున ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితం అవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×