Iphone 16e Launch : టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 16ఈ (iPhone 16e)ని భారత మార్కెట్‌లోకి పరిచయం చేసింది. అదే సమయంలో, తన అధికారిక స్టోర్ నుంచి ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE) మోడల్‌ను తొలగించింది. ఇంతకు ముందు ఐఫోన్ ఎస్‌ఈ 4ను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, కొత్త మోడల్‌తో ఐఫోన్ 16 సిరీస్‌ను విస్తరించింది. మరింత మంది యూజర్లకు చేరువగా ఉండేందుకు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి..
దీని ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16ఈ సిరీస్ ఫోన్‌లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ (OLED) స్క్రీన్ ఇవ్వబడింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడి ఉంది. అలాటే 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో యాక్షన్ బటన్ (Action Button) ఇవ్వబడింది. ఏ18 (A18) చిప్‌ను అమర్చారు, ఇది ఏఐ (AI) ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
వెనుక వైపు 48 ఎంపి (MP) కెమెరా, ముందు వైపు సెల్ఫీ కోసం 12 ఎంపి కెమెరా ఉంది. ఇది ఛార్జింగ్ చూస్తే.. 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో అందుబాటులో ఉంది. దాంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. మిగతా ఐఫోన్ 16 సిరీస్ లో లాగా శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా ఇందులో జోడించారు. ఈ ఫోన్ ఐఓఎస్ 18 (iOS 18)పై పనిచేస్తుంది. ఫేస్ రికగ్నైషన్ (Face Recognition), యూఎస్‌బీ టైప్ సీ (USB Type-C) పోర్ట్ ని ఈ కొత్త మోడల్ సపోర్ట్ చేస్తుంది.
ధర వివరాలు
ఈ కొత్త మోడల్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ లోని అన్ని ఫోన్ల ధరలు పోలిస్తే.. ఇదే అతి తక్కువగా అనిపిస్తోంది.
128 జీబీ (GB) వేరియంట్: రూ. 59,900
256 జీబీ వేరియంట్: రూ. 69,900
512 జీబీ వేరియంట్: రూ. 89,900
ఫిబ్రవరి 21 నుంచి ముందస్తు ఆర్డర్‌లు, 28 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తుంది.
Also Read: 6000mAh బ్యాటరీతో వస్తున్న వన్ ప్లస్ 13 మినీ.. ఇంత క్రేజీగా ఉందేంటి మామ!
ఐఫోన్ 16 , ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేకతలతో పోలిస్తే..
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లలో వరుసగా 6.1 , 6.7 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లలో ఫోకస్, డెప్త్ కంట్రోల్ (Depth Control) ఫీచర్‌తో కూడిన పోర్టాసోనిక్ కెమెరా ఉంది. ఇది మాక్రో ఫోటోగ్రఫీ, ఆటో ఫోకస్‌తో సుదూర ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది.
శాటిలైట్ ఫీచర్
ఐఫోన్ 16 , ఐఫోన్ 16 ప్లస్ మునుపటి ఐఫోన్‌ల మాదిరిగానే శాటిలైట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 15లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు, అది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఫీచర్‌ను 17 దేశాలలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 లోయెస్ట్ వేరియంట్ ధర రూ. 69,999 గా ఉంది. అలా ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 78,999. అంటే ఈ రెండెంటితో పోలిస్తే.. ఇప్పుడు లాంచ్ అయిన ఐఫోన్ 16e నే ఈ సిరీస్ లో అతితక్కువ ధర ఐఫోన్.