BigTV English

Akkineni Family: వారసుల కోసం అతడిని తొక్కేశారా.. ఆ కుట్ర వెనుక కారణం ..?

Akkineni Family: వారసుల కోసం అతడిని తొక్కేశారా.. ఆ కుట్ర వెనుక కారణం ..?
Advertisement

Akkineni Family.. అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family)వారసులు అనగానే ముందుగా మనకు నాగార్జున ( Nagarjuna)మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన సినీ ఇండస్ట్రీలో వేగంగా పాపులారిటీ సంపాదించుకున్నారు కాబట్టి. అయితే అక్కినేని నాగేశ్వరరావుకి మరొక కొడుకు ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆయనే వెంకట్ (Akkineni Venkat).. అక్కినేని నాగేశ్వరరావు పెద్దకొడుకు.. సినిమా ముందుకు రాకపోయినా సినిమా సక్సెస్ కి ఆయన కారణం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అలాగే తన తమ్ముడు అక్కినేని నాగార్జున సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, వారి సక్సెస్ కు కారణమయ్యారు.


అక్కినేని మరో వారసుడు గురించి తెలుసా..

ఇకపోతే ఇండస్ట్రీకి నాగార్జున వారసులు అక్కినేని నాగచైతన్య , అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే నాగచైతన్య టైర్ 2 హీరోగా సెటిల్ అయ్యారు. కానీ అఖిల్ మాత్రం సక్సెస్ కోసం గట్టిగానే కష్టపడుతున్నారని చెప్పాలి. అయితే వీరిద్దరినీ కాదని మరో అక్కినేని హీరో కూడా ఉన్నారు. ఈయన గురించి బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తెరపై కనిపించింది లేదు పైగా సినిమా ఫంక్షన్లకు ఏ రోజు కూడా హాజరుకారు. మీడియా ముందుకి అసలే రారు. ఆయన ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు మరో మనవడు.. అదేనండి అక్కినేని వెంకట్ కొడుకు అక్కినేని ఆదిత్య. అయితే ఆదిత్య ను ఇండస్ట్రీకి రానివ్వకుండా నాగార్జున తొక్కేశారు అనే వార్తలు గతంలో జోరుగా వినిపించాయి.


రూమర్స్ కి చెక్ పెట్టిన అక్కినేని వెంకట్..

అయితే ఈ విషయాలకు చెక్ పెడుతూ అక్కినేని వెంకట్ చేసిన కామెంట్లు ఒక్కసారిగా రూమర్స్ కి చెక్ పడేలా చేశాయని చెప్పవచ్చు. గతంలో అక్కినేని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు ఆదిత్య కు ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన లేదు. ఆదిత్యను ఇండస్ట్రీ లోకి తీసుకురావడానికి నేను, నాగార్జున ఎంతో ప్రయత్నం చేశాము. కానీ ఆదిత్య ఇండస్ట్రీలోకి రానని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో ఆ ప్రయత్నాన్ని మేము విరమించుకున్నాము.ఆదిత్య ఇండస్ట్రీలోకి వస్తే తన కొడుకుల కెరియర్ నాశనం అవుతుందని.. అందుకే ప్రోత్సహించలేదు అంటూ నాగార్జునపై ఎవరో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. నాగార్జున కూడా ఆదిత్య ఇండస్ట్రీలో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆదిత్య సముఖంగా లేకపోవడం వల్లే వదిలేశారు అంటూ తెలిపారు వెంకట్.

ఆదిత్య ఇండియన్ ఛాంపియన్..

దీంతో ఆదిత్య ప్రస్తుతం ఏం చేస్తున్నారు.? ఎక్కడ ఉన్నారు.? అనే విషయాలు తెలుసుకోవడానికి అక్కినేని అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే అక్కినేని ఆదిత్య ఇండస్ట్రీలోకి రాకపోయినా మంచి గుర్తింపే సొంతం చేసుకున్నారు. ఆదిత్య స్పోర్ట్స్ మెన్. ఇతడు రొటాక్స్ మాక్స్ కార్టింగ్ లో ఇండియన్ ఛాంపియన్ కూడా.. అంటే ఇది ఒక కార్ రేస్. అంతేకాదు ఇది చాలా కాస్ట్లీ క్రీడ కూడా.. సరైన స్పాన్సర్స్ దొరకపోవడం వల్ల ఆదిత్య ముందుకు వెళ్లకపోయాడనేది వాస్తవం. ఆదిత్య కు వివాహం అయ్యింది కాబట్టి ఇక చిత్రాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు నచ్చిన క్రీడలో సెటిల్ కాలేక ఇటు సినిమా రంగంలోకి రాలేక బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×