Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య.. గత కొన్నిరోజులుగా ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అక్కినేని నటవారసుడుగా తెలుగుతెరకు పరిచయమైన ఈ హీరో.. విజయాపజయాలను పట్టించుకోకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. చై సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. అందుకు కారణం హీరోయిన్ సమంత.
ఏ మాయ చేసావే సినీమాతో ఈ జంట పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. ఈ జంట పెళ్లి చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు. వీరిద్దరూ కలకాలం కలిసి ఉండాలని కోరుకున్నారు. మూడేళ్ళ వీరి దాంపత్యంలో ఎప్పుడెప్పుడు సామ్ ప్రెగ్నెంట్ అని చెప్తుందా .. ? అని ఎదురుచూసారు. కానీ, ఆ ఎదురుచూపులు నిజం కాకముందే ఈ జంట విడిపోయింది. వీరి విడాకులకు కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి నచ్చిన కారణాలు వారు చెప్పుకుంటూ వస్తున్నారు.
Dulquer Salmaan: టాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న దుల్కర్.. మరో తెలుగు మూవీ కన్ఫర్మ్
కొంతమంది చైది తప్పేంటే.. ఇంకొంతమంది సామ్ ది తప్పు అంటారు. ఇలా వారు విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఈ క్షణం వరకు వారిగురించి ఏదో ఒక పుకారు పుడుతూనే వస్తుంది. ఇక ఇవన్నీ పట్టించుకోకుండా సామ్- చై తమ కెరీర్ పై ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ మధ్యనే అక్కినేని నాగ చైతన్య.. నటి శోభితాను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి అబ్బాయికి.. ఫ్యామిలీ అనేది ఒక కల. పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలతో లైఫ్ ను లీడ్ చేయాలనే కోరుకుంటారు. అందుకు చై కూడా అతీతం కాదు. తాజాగా రానా దగ్గుబాటి షోలో చై తన భవిష్యత్తు ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. రానా షోలో దగ్గుబాటి – అక్కినేని వారసులు సందడి చేశారు. ఇక ఇందులో రానా.. 50 ఏళ్ల తరువాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావ్ అని చైని అడగగా.. ” ఇద్దరు పిల్లలు.. సక్సెస్ ఫుల్ లైఫ్. సక్సెస్ అంటే ఏంటో అనుకుంటారు. నా దృష్టిలో సక్సెస్ అంటే.. జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే అదే సక్సెస్.
Pushpa 3 Rampage: పుష్ప సినిమాను ఇలా ప్లాన్ చేసుకుంటూ పోతే వెబ్ సిరీస్ అయిపోతుంది గురు
50 ఏళ్ళ వయస్సులో ఇద్దరు పిల్లలతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్లి తనతో రేసింగ్ చేస్తాను.. అదే కూతురు అయితే తనకు ఎందులో ఇష్టముందో అందులో ఎదగమని ప్రోత్సహిస్తాను” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటాను.. చిన్నప్పుడు మనం ఎలాంటి క్షణాలను అయితే అనుభవించామో వారికి కూడా అలాంటి క్షణాలను ఇవ్వాలని అనుకుంటాను అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అంటే.. చై కు తండ్రిగా మారాలని చాలా కోరికగా ఉంది.. త్వరలోనే అది నిజం అవ్వాలని కోరుకుంటున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. చై కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది.