BigTV English

Pushpa 3 Rampage: పుష్ప సినిమాను ఇలా ప్లాన్ చేసుకుంటూ పోతే వెబ్ సిరీస్ అయిపోతుంది గురు

Pushpa 3 Rampage: పుష్ప సినిమాను ఇలా ప్లాన్ చేసుకుంటూ పోతే వెబ్ సిరీస్ అయిపోతుంది గురు

Pushpa 3 rampage : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) రికార్డ్స్ ను ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది. ఆ తర్వాత రాజమౌళి చేసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చూపించింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా కూడా మంచి సక్సెస్ ను పొందుకుంది.


పుష్ప 2 సినిమాకి సంబంధించి మొదట వేర్ ఇస్ పుష్ప అనే ఒక వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ పార్ట్ కి సంబంధించిన విజువల్స్ కానీ స్టోరీ గానీ పుష్ప 2 సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అయితే సినిమా చూసిన వెంటనే చాలామందికి ఇదే డౌట్ వచ్చింది. సినిమా కథను పూర్తిగా మార్చేశారు అంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే అసలు విషయానికి వస్తే పుష్ప 2 సినిమాకి సంబంధించి ఈ కథ జపాన్ లో మొదలవుతుంది. జపాన్లో అల్లు అర్జున్ ని కాల్చినప్పుడు తను నీటిలో పడిపోతాడు. అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ కట్ చేశాడు సుకుమార్. అయితే పుష్ప 2 విషయానికొస్తే కథ కొంచెం ఉన్నా కూడా ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ రేంజ్ లో ఉన్నాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ అవుతున్న తరుణంలోనే నాలుగు గంటలు ఫుటేజ్ వచ్చింది అని కొన్ని వార్తలు కూడా వినిపించాయి.

ఇకపోతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 3 (Pushpa 3) కి సంబంధించిన ఫుటేజ్ కూడా చిత్ర యూనిట్ దగ్గర కొంత మేరకు ఉంది అని తెలుస్తుంది. పుష్ప 2 లో చూపించాల్సిన చాలా అంశాలను చూపించలేదు. వేర్ ఇస్ పుష్ప అనే వీడియో కూడా లేదు. అసలు పోలీసులు కాల్పులకి గురి అయిన పుష్పరాజ్ చచ్చిపోయాడు అని అందరూ అనుకున్న తరుణంలో శ్రీశైలం అడవుల్లో పుష్ప కనిపించడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అలానే పులి రెండు అడుగులు పుష్ప రాజు చూసి వెనక్కి వేయడం గురించి కూడా రాంపేజ్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని భారీ ఎలివేషన్స్ ఇవ్వడం వలన కథను ఇంకా సాగదీయడం జరుగుతుంది. ఇలా సాగదీస్తూ పోతే దీనిని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసే అవకాశం ఉంది.


Also Read : Pushpa 2 Collection day 2: అవి సంఖ్యలా.? నిజంగా వస్తున్న కలెక్షన్లా.?

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×