BigTV English

Dulquer Salmaan: టాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న దుల్కర్.. మరో తెలుగు మూవీ కన్ఫర్మ్

Dulquer Salmaan: టాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న దుల్కర్.. మరో తెలుగు మూవీ కన్ఫర్మ్

Dulquer Salmaan: మామూలుగా టాలీవుడ్‌లోని యంగ్ హీరోలే ఒక్క హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదుర్కొని ఒక్క హిట్ వస్తే చాలు అని ఎదురుచూస్తున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక మలయాళ హీరో.. టాలీవుడ్‌లో అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అంతే కాకుండా టాలీవుడ్‌లో తన మార్కెట్‌ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో తెలుగు హీరోలు తన స్టామినా చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ హీరో మరెవరో కాదు.. దుల్కర్ సల్మాన్. ఇటీవల ‘లక్కీ భాస్కర్’తో రూ.100 కోట్ల కొల్లగొట్టిన ఈ హీరో.. ఇప్పుడు మరో తెలుగు సినిమాను సైన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.


గట్టి పోటీ

మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్. నెపో కిడ్ అయినా కూడా తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తనకు మలయాళంలో మంచి మార్కెట్ ఏర్పడింది. మలయాళంతో పాటు అప్పుడప్పుడు పలు తమిళ చిత్రాల్లో కూడా దుల్కర్ నటించాడు. అదే సమయంలో ‘మహానటి’లో ఒక కీలక పాత్రలో నటించడానికి దుల్కర్ సల్మాన్‌కు అవకాశం లభించింది. అది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా చేయడానికి దుల్కర్ ఒప్పుకున్నాడు. అలా తెలుగులో తన అడుగుపడింది.


Also Read: విడాకుల వల్ల ఏఆర్ రెహమాన్ కెరీర్‌కు బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన కూతురు

డైరెక్టర్ ఫిక్స్

ఇప్పటికే ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో ఒక తెలుగు సినిమా చేయడానికి దుల్కర్ సల్మాన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఈ విషయం చాలాకాలం నుండే ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నా తాజాగా ఈ మూవీ డైరెక్టర్ గురించి ఒక తాజా అప్డేట్ బయటికొచ్చింది. హీరో, హీరోయిన్, నిర్మాత.. ఇలా అందరూ సెట్ అయిపోయిన కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు డైరెక్టర్ ఓకే అవ్వలేదు. ఇక రవి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా తెరకెక్కనుందని కన్ఫర్మ్ అయ్యింది. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు రవి. ఇప్పుడు తానే డైరెక్టర్‌గా మారి ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు.

ఫ్రెష్ పెయిర్

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), పూజా హెగ్డే (Pooja Hegde) మొదటిసారి కలిసి నటిస్తున్నారు. దీంతో ఆన్ స్క్రీన్ ఈ పెయిర్ ఎలా ఉండబోతుందని కూడా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా డిసెంబర్ 11 నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ కూడా పూర్తిచేయనున్నారు మేకర్స్. ఇదొక పూర్తి స్థాయి ప్రేమకథగా తెరకెక్కనుంది. దుల్కర్ సల్మాన్ ఏ కథ పట్టినా అది బంగారం అవుతుంది. దీంతో ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలంతా తనను చూసి అలర్ట్ అవ్వాల్సిందే. ప్రస్తుతం దుల్కర్ చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్స్ హిట్ అయితే.. టాలీవుడ్‌లో తనకు బ్రేకులు వేయడం కష్టమే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×