BigTV English
Advertisement

Dootha Web Series : ఓటీటీ లో వస్తున్న నాగ చైతన్య వెబ్ సీరీస్.. ఎప్పుడు?.. ఎక్కడా..తెలుసా?

Dootha Web Series : ఓటీటీ లో వస్తున్న నాగ చైతన్య వెబ్ సీరీస్.. ఎప్పుడు?.. ఎక్కడా..తెలుసా?

Dootha Web Series : అక్కినేని నట వారసుడిగా జోష్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు నాగ చైతన్య. మొదటిలో అద్భుతమైన చిత్రాలు చేసి మంచి స్టార్ హీరోగా ఎదిగాడు. అతని కెరియర్ లో మంచి సినిమాలు ఎన్ని ఉన్నాయో ప్లాపులు కూడా అలాగే వెంటాడుతున్నాయి. ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతో దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం చైతన్య బాగా కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది.


ఇక సినీ యాక్టర్స్ క్రమంగా వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తన లక్ ట్రై చేసుకోవడానికి ఫిక్సయిన నాగచైతన్య వెబ్ సిరీస్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే చైతుతో రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

చాలా కాలం క్రితమే ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించినప్పటికీ హీరోకు, డైరెక్టర్ కు వేరే కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఈ ప్రాజెక్టు కాస్త లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సిరీస్ పూర్తి అయింది. దీనికి దూత అనే వెరైటీ టైటిల్ ని కూడా పెట్టారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూపొందుతున్న మొట్టమొదటి అచ్చమైన తెలుగు వెబ్ సిరీస్ ఇదే. అయితే వెబ్ సిరీస్ రాబోతున్నట్లు ప్రకటించారు తప్ప తిరిగి మళ్ళీ దాని ఊసు కూడా ఎవరు ఎత్త లేదు.


మొన్న ఈ మధ్య నాగచైతన్య కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది కానీ ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు అని అన్నాడు. చాలా రోజుల వరకు అమెజాన్ నుంచి దూత వెబ్ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయంపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అసలు ఈ వెబ్ సిరీస్ వస్తుందా రాదా అన్న అనుమానాలు కూడా అక్కడక్కడ వినిపించాయి.

ఈ రూమర్స్ అన్నిటికీ బ్రేకులు వేస్తూ ఎట్టకేలకు వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. నిజానికి ఈ వెబ్ సిరీస్ ఆగస్టులోనే విడుదల అవుతుంది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి . అయితే ఇప్పుడు తాజాగా ప్రకటించిన దాన్నిబట్టి డిసెంబర్ 1 నుంచి నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ నిడివి సుమారు 40 నిమిషాల వరకు ఉంటుంది.

దూత వెబ్ సిరీస్ బడ్జెట్ దాదాపు 40 కోట్లు అని సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య తో పాటు పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రను పోషించారు. దూత ఒక క్రైమ్ వేస్ట్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×