BigTV English
Advertisement

Sankranthiki Vasthunam: బ్లాక్ బస్టర్ పొంగల్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

Sankranthiki Vasthunam: బ్లాక్ బస్టర్ పొంగల్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పేరుకు తగ్గట్టే సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్..  రెండు సంక్రాంతికి వస్తున్నాం. రెండు సినిమాలలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాకే భారీగా ఖర్చుపెట్టాడు. కానీ, ఆ సినిమా భారీ పరాజయాన్ని అందుకొని.. హార్ట్ కింగ్  ను నష్టాల్లోకి తోసింది.


ఇక దేవుడు.. మంచి, చెడు బ్యాలన్స్ చేసినట్లు.. గేమ్ ఛేంజర్ సినిమా నష్టాల్లో కూరుకుపోయిన.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కొద్దిలో కొద్దిగా పైకి తేరుకొనేలా చేసింది. అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ అనుకున్నవారి చేత.. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించాడు. జనవరి 14 న రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఏకధాటిగా ప్రేక్షకులను థియేటర్ కు రప్పిస్తునే ఉంది. 13 రోజులకు గాను సంక్రాంతికి వస్తున్నాం  సినిమా రూ. 276 కోట్లు వసూలు చేసి రికార్డ్ ను సృష్టించింది.

ఇప్పటివరకు వెంకీ మామ కెరీర్ లో ఇలాంటి రికార్డులు లేవనే చెప్పాలి.  వంద కోట్ల క్లబ్ లో వెంకీ మామ కూడా జాయిన్ అయ్యాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. బుల్లిరాజు కామెడీ ఒక్కట్టే ఒక ఎత్తు. తండ్రి మీద మాట పడనివ్వని కొడుకుగా మాస్టర్ రేవంత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాపై హైప్ పెంచడానికి మేకర్స్.. వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్లాక్ బస్టర్ పొంగల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


Comedian Ali: మళ్లీ పెళ్లి చేసుకున్న కమెడియన్ ఆలీ.. దగ్గరుండి కూతురే..

సాంగ్ మొత్తం సంక్రాంతి పండగ వైబ్ కనిపిస్తుంది. అటిట్యూడ్ పొంగల్ అంటూ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి స్టెప్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ ను వెంకీ మామ స్వయంగా పాడడం మరొక ప్రత్యేకత అని చెప్పాలి. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్.. వెంకీ మామ బేస్ వాయిస్.. ఈ సాంగ్ ను చార్ట్ బస్టర్ లిస్ట్ లో చేరేలా చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో  సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం వెంకటేష్ కొత్త ట్రెండ్ ను సృష్టించాడు అని చెప్పాలి . ఇప్పటివరకు స్టార్ హీరోలు.. తమ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఒక రెండు ఇంటర్వ్యూలు ఇచ్చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించి వెళ్ళిపోతారు. కానీ, వెంకీ- అనిల్ తమ సినిమాకు అక్కడితో ఆగలేదు. ప్రేక్షకుల మధ్యకు వెళ్లారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరే కనిపించేలా చేశారు.

సినిమా ఈవెంట్స్, సీరియల్ ఈవెంట్స్.. షోస్ అన్నింటిలో అనిల్ .. వెంకీ మామను తీసుకొచ్చి ప్రమోషన్ చేయించాడు. వెంకీ సైతం తాను సీనియర్ హీరో అనే గర్వం లేకుండా ఏ ఈవెంట్ కు వచ్చినా  డ్యాన్స్ వేస్తూ.. సాంగ్ పాడుతూ అలరించాడు. ఇలా ప్రమోషన్స్ చేయడం వలనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశతయోక్తి లేదు. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుందో చూడాలి. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×