BigTV English
Advertisement

Akkineni Nagarjuna: కుబేరను మాయాబజార్ తో పోల్చిన నాగ్.. హిట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి ?

Akkineni Nagarjuna: కుబేరను మాయాబజార్ తో పోల్చిన నాగ్.. హిట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి ?

Akkineni Nagarjuna: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20న కుబేర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. గత రాత్రి కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కుబేర ట్రైలర్ ను రాజమౌళి రిలీజ్ చేసి మొదటి టికెట్ ను కొనుగోలు చేశారు.


 

ఇక ఈ వేదికపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ధనుష్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే ఈ సినిమాతో పాటు ఆయన నటించిన ప్రతి సినిమా మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అని, ఆయనతో పాటు మేము అందరం కూడా మా కంఫర్ట్ జోన్ వదిలి ఈ సినిమా చేసినట్లు తెలిపాడు.నాగార్జున..  కుబేర సినిమాను మాయాబజార్ సినిమాతో పోల్చడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలోనే అద్భుతమైన కళాఖండాలలో మాయాబజార్ ఒకటి. కె.వి.రెడ్డి దర్శకత్వ వహించిన ఈ సినిమాను కొట్టే సినిమా ఇప్పటివరకు  ఏది రాలేదు అని అంటే అతిశయోక్తి కాదు.


 

ఇప్పుడు కుబేరను మాయాబజార్ తో నాగ్  పోల్చడం సంచలనంగా మారింది. మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వీరిలో హీరో ఎవరు..? వారెవరు కాదు దర్శకుడు కె.వి.రెడ్డినే ఆ సినిమాకు హీరో. అలాగే కుబేరకు నాగార్జున, ధనుష్ హీరో కాదు. శేఖర్ కమ్ములానే సినిమాకు హీరో అని నాగార్జున చెప్పడం ఆసక్తిగా మారింది.  ఇక అంత పెద్ద సినిమాతో ఈ సినిమాను పోల్చడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు శేఖర్ ఒక హీరో అయితే  మరో హీరో దేవిశ్రీప్రసాద్ అని చెప్పుకొచ్చాడు నాగార్జున.

 

దేవి.. తనతో చాలా సినిమాలు చేసినా  కుబేరకు ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా ఉంటుందని తెలిపాడు. ఇక నాగార్జున స్పీచ్ తో కుబేర సినిమాకు పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ప్రీ  రిలీజ్ ఈవెంట్ లో గానీ, ఇంటర్వ్యూలో గానీ హీరోలు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకునే సినిమాకు ప్రేక్షకులు వెళతారు. కానీ, రిలీజ్ అయ్యాక ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా..? లేదా..? అనేదాని బట్టే రిజల్ట్ ఉంటుంది.  ఈవెంట్స్ లో హీరోలు మాట్లాడిన మాటలకు సినిమా సక్సెస్ అయితేనే న్యాయం జరిగినట్లు ఉంటుంది.  నాగార్జున మాయాబజార్ లాంటి పెద్ద సినిమాతో కుబేరను పోల్చడం బానే ఉంది గానీ  ఒకవేళ కుబేర అంతటి హిట్ ను అందుకోకపోతే పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి జూన్ 20న కుబేర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×