BigTV English

Jayasudha: ఆ హీరో డంపింగ్ యార్డ్ కొనమన్నాడు.. పిచ్చా అనుకున్నా.. ఇప్పుడు దాని విలువ రూ. 100 కోట్లు

Jayasudha: ఆ హీరో డంపింగ్ యార్డ్ కొనమన్నాడు.. పిచ్చా అనుకున్నా.. ఇప్పుడు దాని విలువ రూ. 100 కోట్లు

Jayasudha: సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ  హీరోలుగా కొనసాగుతున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి వారి తరువాత  అంతటి గుర్తింపును తెచ్చుకున్న హీరో శోభన్ బాబు.  ఇక హీరోగానే ప్రేక్షకుల మదిలో ఉండిపోవాలని.. మళ్లీ రీఎంట్రీ కూడా ఇవ్వకుండా అలానే చనిపోయారు. అందుకే ఆయన గురించి అంత గొప్పగా చెప్పుకొస్తారు.


సినిమాల విషయం పక్కన పెడితే.. శోభన్ బాబు డబ్బును వృథాగా ఖర్చుపెట్టే వ్యక్తి కాదు. ఇప్పటికీ ఆయన కొడుకులు ఇండస్ట్రీలో లేకుండా ధనవంతులుగా జీవిస్తున్నారు అంటే.. అది శోభన్ బాబు పెట్టిన పెట్టుబడుల వలనే.  ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఎన్టీఆర్, ఏయన్నార్ లకు కూడా రియల్ ఎస్టేట్ విషయంలో శోభన్ బాబు సలహాలు తీసుకొనేవారంటే అతిశయోక్తి కాదు.

కొద్దిగా డబ్బు ఉన్నా కూడా ఒక స్థలం కోనేసేవాడట. ఆయన కొనడమే కాకుండా తనతో నటించవారికి కూడా సలహాలు ఇచ్చేవారట. ఈ విషయాన్నీ చాలామంది సీనియర్ నటులు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అప్పట్లో శోభన్ బాబు గారు ఆ స్థలం కొనమంటే కొనలేదు. ఆయన మాట వింటే బావుండేది అని ఎంతోమంది చెప్పుకొచ్చారు. అలా చెప్పినవారిలో జయసుధ కూడా ఒకరు.


సహజనటిగా పేరు తెచ్చుకున్న  ఆమె.. శోభన్ బాబుతో ఎన్నో సినిమాల్లో నటించింది. వారిద్దరిది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక ఒక ఇంటర్వ్యూలో జయసుధ.. శోభన్ బాబు చెప్పిన మాట వినలేదని చెప్పుకొచ్చింది. ఒక డంపింగ్ యార్డ్ కొనమంటే తాను కొనలేదని, అప్పుడు అది కొని ఉంటే తాను నెక్స్ట్ లెవెల్ లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. ” ఒకసారి మేము షూటింగ్ కు వెళ్ళినప్పుడు.. ఇద్దరం కారులో వస్తున్నాం. వచ్చేటప్పుడు  ఏమోయ్.. నన్ను ఆయన అలానే పిలుస్తారు.

Indraja: జబర్దస్త్‌ అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారు.. నాపై కూడా వల్గర్ కామెంట్స్..

ఏమోయ్.. నీకు నేనొక స్థలం చూపిస్తాను.. మీ నాన్నగారికి చెప్పి దాన్ని నువ్వు కొను అన్నారు. తరువాత మా ఆయన నితిన్ తో కలిసి వెళ్లి చూస్తే అది డంపింగ్ యార్డ్. అది చూసి.. ఈయనేకమైనా పిచ్చా ఏంటి.. డంపింగ్ యార్డ్ చూపించి  కొనమంటున్నాడు. నీకు తెలియదు.. ఇక్కడ ఇదంతా ఎందుకు డంప్ చేస్తున్నారు అంటే.. ఇక్కడ చదును చేసి మంచి ప్లేస్ చేస్తారు అని చెప్పారు. అయినా  నేను కొనలేదు.

అది ఇవాళ చెన్నైలోని అన్నానగర్ ఏరియాగా మారింది. ఇప్పుడు అది ఎన్ని కోట్లంటే ఏం చెప్తాము.. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం.. రూ.100 కోట్లు ఉంది. అలాంటివి  చాలా ఉన్నాయి. అప్పుడు శోభన్ బాబు గారు చెప్పినవి మేము వినలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి అని కొందరు. శోభన్ బాబు  మంచి ఫైనాన్షియల్ ప్లానర్.. ఆయన ఏది చేసినా ఆచితూచి చేస్తారు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×