BigTV English

Akkineni Venkat : అందుకే దూరంగా ఉన్నా.. అక్కినేని వెంకట్ సంచలన స్టేట్మెంట్..

Akkineni Venkat : అందుకే దూరంగా ఉన్నా.. అక్కినేని వెంకట్ సంచలన స్టేట్మెంట్..
Akkineni Venkat

Akkineni Venkat : ఏఎన్నార్ కొడుకు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నాగార్జున. కానీ ఏఎన్ఆర్ కు వెంకట్ అనే పెద్ద కొడుకు ఉన్నాడు అన్న విషయం తెలుసు కానీ నాగార్జున తెలిసినంతగా అతని గురించి చాలామందికి తెలియదు. నిర్మాతగా ఎన్నో సినిమాలకు సారథ్యం వహించిన అతను ఎప్పుడు కెమెరా ముందుకు మాత్రం రాలేదు. ఎప్పుడు బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే వెంకట్.. ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకునేవారు అని టాక్.


అయితే ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు అన్ని నాగార్జున చూసుకోవడంతో వెంకట్ ఏమైనట్లు అని పలు అనుమానాలు తలెత్తాయి. కొందరైతే ఆస్తి పంపకాల్లో ఏవైనా గొడవలు వచ్చాయేమో అన్న సందేహాన్ని సైతం వ్యక్తం చేశారు. అయితే తాజాగా వీటి గురించి మాట్లాడిన వెంకట్ అసలు ఏం జరిగింది అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.

నేను ,నాగ్ ఎప్పుడు సినిమా వాతావరణం లో పెరగలేదు. మమ్మల్ని నాన్నగారు ఎప్పుడు సినిమాలకు దూరంగా ఉంచాలని చూశారు. అందుకే మాకు సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదు. మా చదువులు పూర్తయిన తర్వాత నాన్నగారితో నేనే నాగార్జున ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మాట్లాడాను. నాగ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్న దానికి నాన్నగారు ఒప్పుకోవడం నాకు  ఆశ్చ‌ర్యంగానే అనిపించింది. అలా నాగార్జున సినిమా లోకి హీరోగా ఎంటర్ అయ్యాడు.


ఇక నేను అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన అన్ని పనులు చూసుకోవడంలో బిజీ అయిపోయాను. అయితే ఆ తర్వాత జనరేషన్ గ్యాప్ కారణంగా.. కొత్త పోకడలకు ఆస్కారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేనే పక్కకు తప్పుకున్నాను. సినిమా వ్య‌వ‌హ‌రాల గురించి నాకు అంతగా తెలియదు.. పైగా నాగార్జునకు నాకంటే వీటిపై అవగాహన ఎక్కువ. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు నాగార్జున చూసుకుంటున్నాడు అంతేకానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఇప్పటికీ మేము ఎప్పుడు టచ్ లోనే ఉంటాము అని వెంకట్ అన్నారు.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×