Akshay Kumar: చాలావరకు బాలీవుడ్ హీరోలు తమకు అనిపించి అనిపించినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. దాని వల్ల కాంట్రవర్సీలు అయినా పట్టించుకోరు. పలు సందర్భాల్లో నవ్వుతూనే నిజాలు చెప్తేస్తూ ఉంటారు. ఎవరైనా వాటిని సీరియస్‌గా తీసుకుంటే ఫన్నీగా చెప్పానని అంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్‌లో ఉన్నాయి. ప్రేక్షకులు తన గురించి ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయి ఈ నటుడి మాటలు. అలాంటి హీరో తాజాగా ఒక ఫ్యాన్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. అందులో ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ నిజం చెప్పేశాడు అక్షయ్. ఆ కామెంట్స్ చూస్తుంటే ఇన్‌డైరెక్ట్‌గా నిర్మాతలపై కామెంట్స్ చేసినట్టుగా ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
ఎందుకిలా జరిగింది.?
అక్షయ్ కుమార్ (Akshay Kumar) కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. తను హీరోగా నటించిన ఒక సినిమా హిట్ అయితే.. దానిని ఫ్రాంచైజ్‌లాగా క్రియేట్ చేసి కూడా నిర్మాతలు డబ్బు సంపాదించుకున్నారు. అలాంటి అక్షయ్ కుమార్ చేతి నుండి ఒక హిట్ ఫ్రాంచైజ్ మిస్ అయ్యింది. అదే ‘భూల్ భూలయ్యా’ (Bhool Bhulaiyaa). రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించి ఈ చిత్రం. ఇది తమిళంతో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. హిందీలో కూడా అదే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ సాధించింది. అలాంటి సినిమాకు చాలాకాలం తర్వాత సీక్వెల్ తెరకెక్కగా అందులో అక్షయ్ కుమార్ లేడు. ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు తాజాగా సమాధానమిచ్చాడు.
నేను వదులుకోలేదు
‘భూల్ భూలయ్యా 2’లో మీరెందుకు నటించలేదు అని ఒక ఫ్యాన్ దగ్గర నుండి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నేను వదలుకోలేదు. నన్ను తీసేశారు’’ అని సమాధానమిచ్చాడు అక్షయ్ కుమార్. 2007లో విడుదలయిన ‘భూల్ భూలయ్యా’లో డాక్టర్ పాత్రలో కనిపించాడు అక్షయ్ కుమార్. అంతే కాకుండా బాబా గెటప్‌లో కూడా ప్రేక్షకులను అలరించాడు. అప్పట్లో ఈ బాబా గెటప్ బాగా క్లిక్ అయ్యింది. మూవీ ఓ రేంజ్‌లో హిట్ అవ్వడానికి అక్షయ్ ముఖ్య కారణంగా నిలిచాడు. అలాంటిది 2022లో విడుదలయిన ‘భూల్ భూలయ్యా 2’లో మాత్రం ఈ గెటప్, ఈ పాత్ర కార్తిక్ ఆర్యన్ చేతికి వెళ్లింది. ఆ సినిమా కూడా ఒక రేంజ్‌లో హిట్ అయ్యి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
Also Read: మళ్లీ కలిసిపోయిన మాజీ ప్రేమికులు.. కలిసికట్టుగా ఆ పని..!
పర్ఫార్మెన్స్‌కు ఫిదా
‘భూల్ భూలయ్యా 2’కు ముందు కూడా కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan)కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కానీ తనను కమర్షియల్ హీరోగా నిలబెట్టింది మాత్రం ఈ సినిమానే. ఈ ఒక్క మూవీతో తన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అప్పట్లో రూహ్ బాబాగా తన పర్ఫార్మెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు కాబట్టి తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన ‘భూల్ భూలయ్యా 3’లో కూడా కార్తిక్‌నే హీరోగా ఎంచుకున్నారు మేకర్స్. కానీ ముందు విడుదలయిన రెండు సినిమాల్లాగా ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించకపోయింది.