BigTV English

RGV: సిండికేట్.. ఈ ఒక్క సినిమాతో నా పాపాలన్నీ కడిగేసుకుంటాను..

RGV: సిండికేట్.. ఈ ఒక్క సినిమాతో నా పాపాలన్నీ కడిగేసుకుంటాను..

RGV: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే.. ఆ వోడ్కా తాగేసి పోస్ట్ చేసి ఉంటాడు. అదంతా నమ్మితే కష్టం అని నెటిజన్స్ మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాం. కానీ, ఈసారి మాత్రం వర్మ చెప్పినట్లుగానే చేశాడు. నిన్నటికి నిన్న సత్య సినిమా చూసాక తనలో ఒక రియలైజేషన్  వచ్చిందని ఒక సుదీర్ఘ  నోట్ రాసుకొచ్చిన విషయం విదితమే. “2 రోజుల క్రితం వరకు లక్ష్యం లేని గమ్యం వైపు నా ప్రయాణం సాగింది.


సత్య సినిమా చూసాకా.. హోటల్‌కు తిరిగి వచ్చి, చీకటిలో కూర్చున్నప్పుడు నాకు అర్థం కాలేదు.  నా అంతటి తెలివితేటలతో, భవిష్యత్తులో నేను ఏమి చేయాలో ఈ సినిమాను ఒక బెంచ్‌మార్క్‌గా ఎందుకు సెట్ చేయలేదు అని ఆలోచించాను. నా జిమ్మిక్కులతో, టెక్నాలజీతో ప్రేక్షకులను మెప్పించాలని నా అతి తెలివితో అసభ్యకరమైన సన్నివేశాలు జోడించి చాలా సినిమాలు తీసాను. అర్థపర్థం లేని కథలతో  సినిమాలు తీసాను. దానికి నేను ఎంతో ఏడ్చాను. కానీ,  రెండురోజుల క్రితం నా  కళ్ల నీళ్లు తుడుచుకొని నాకు నేనే ఒక హామీ ఇచ్చుకున్నాను. ఇప్పటి నుండి నేను తీసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవం పెంచేలా తీస్తాను” అని  చెప్పుకొచ్చాడు.

సర్లే.. ఇదేమి అయ్యే పనిలా లేదులే. వర్మ అలానే అంటాడులే అని అందరు లైట్ తీసుకున్నారు. కానీ, ఆర్జీవీ మాత్రం తాను చెప్పింది నిజం చేశాడు. ఈరోజు ఒక కొత్త సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తన సినిమా టైటిల్ తో పాటు  కథను కూడా  వివరించాడు. తన కొత్త సినిమా పేరు సిండికేట్ అని చెప్పుకొచ్చాడు. ” ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. నా  సినిమా పేరు సిండికేట్.   ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించిన సినిమా.


Mumtaj: ఇన్నేళ్లయినా అందుకే పెళ్లి కాలేదంటున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ..!

70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించి, విపరీతమైన డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైనవాటిని  స్మగుల్ చేసే స్మగ్లర్లు పెరిగినప్పుడు.. ఇవి ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయి. ఆ తరువాత వారి ప్లేస్ లో ఘోరమైన కార్పొరేట్ ముఠాలు D COMPANY మొదలైనవి వచ్చాయి. అదేవిధంగా భయంకరమైన ISIS సమూహం ముందు ఘోరమైన అల్ఖైదాతో పోల్చితే ప్రారంభ బ్లాక్ సెప్టెంబర్ ఉగ్రవాదులు తేలిపోయారు.

భారతదేశంలో గత 10 నుండి 15 సంవత్సరాల నుండి చెప్పుకోదగ్గ నేర సంస్థ ఏదీ లేదు, కానీ ప్రస్తుతం దేశంలోని వివిధ దేశాల మధ్య తీవ్రమైన నేర సంస్థ రావడానికి రెడీ అవుతుంది. అయితే గతంలోని సంస్థలకు భిన్నంగా ఈ కొత్త సంస్థ పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, అల్ట్రా రిచ్ బిజినెస్ మెన్ మరియు మిలిటరీతో సహా వివిధ సమూహాల నుండి బలగాలను కలుపుతుంది, తద్వారా ఇది సిండికేట్‌గా మారింది.

SaifAlikhan : ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్ అలీ ఖాన్.. నజరానా ఏమైనా ఇచ్చారా?

సిండికేట్ అనేది సుదూర భవిష్యత్తులో సెట్ చేయని భవిష్యత్ కథ. ఉదాహరణకు, సెప్టెంబర్ 11, 2001న ప్రపంచం మొత్తం ఆల్ఖైదాతో నిద్ర లేచింది. కానీ ఈ విషయం సెప్టెంబర్ 10 వరకు కూడా ఎవరికి తెలియదు.సిండికేట్ చిత్రం ఒక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సిండికేట్ ఎలాంటి సూపర్ పవర్స్ లేని  చాలా ప్రమాదకరమైన సినిమా. కానీ, ఒక మనిషి  భయంకరంగా  ఏమి చేయగలడు అని చూపిస్తుంది. ఈ చిత్రం క్రైమ్ మరియు టెర్రర్ యొక్క స్వభావాన్ని లోతుగా చూపిస్తుంది.

క్రైమ్ మరియు టెర్రర్ ఎప్పటికీ చనిపోవు అనే చీకటి సత్యాన్ని రుజువు చేస్తుంది. వారు మరింత ఘోరమైన ఫార్మ్స్ లో తిరిగి వస్తారు.సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు మరియు ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించబడతాయి. ” అని చెప్పుకొచ్చాడు. కథను బట్టి వర్మ  .. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో అమితాబ్ బచ్చన్, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్నారని టాక్. వీరిద్దరితో  వర్మ మల్టీస్టారర్ తీయనున్నాడని పుకారు  నడుస్తోంది. అదే కనుక నిజమైతే వర్మ ఈజ్  బ్యాక్ అన్నట్లే. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×