Malaika Arora – Arjun Kapoor: ఒకప్పుడు బాలీవుడ్‌లో డేటింగ్, బ్రేకప్స్ అనేవి కామన్ అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండేవారు. కానీ గత కొన్నేళ్లలో బాలీవుడ్‌లో ఇద్దరు సెలబ్రిటీలు ప్రేమించుకుంటే వారు కచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ మొదలయ్యింది. దానికి ఎంతోమంది ప్రేమికుల లవ్ మ్యారేజే కారణం. అలాగే ఆ లిస్ట్‌లో మరో జంట చేరుతుందని అనుకున్నారు ప్రేక్షకులు. వారే అర్జున్ కపూర్, మలైకా అరోరా. దాదాపు అయిదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న అర్జున్, మలైకా.. అలాంటిది తాజాగా బ్రేకప్ చెప్పుకొని ఎవరికి వారుగా ఉంటున్నారు. బ్రేకప్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే చోటిలో కలిసి కనిపించి ప్యాచప్ అయిపోయారా అనే రూమర్స్ క్రియేట్ అయ్యేలా చేశారు.
కలిసి వచ్చారేంటి.?
ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దుండగులు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. వెంటనే సైఫ్‌ను ముంబాయ్‌లోని లీలావతి ఆసుపత్రికి తరలించడంతో అక్కడి వైద్యులు తనకు సర్జరీ చేసి ప్రమాదం నుండి బయటపడేలా చేశారు. అప్పటినుండి చాలామంది సెలబ్రిటీలు సైఫ్ అలీ ఖాన్‌ను చూడడానికి నేరుగా ఆసుపత్రికి రావడం మొదలుపెట్టారు. రాలేని వారు మాత్రం సోషల్ మీడియాలో తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా పోస్టులు షేర్ చేశారు. అయితే సైఫ్ అలీ ఖాన్‌ను చూడడానికి అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసికట్టుగా రావడం ప్రస్తుతం బీ టౌన్‌లో మరొక హాట్ టాపిక్‌గా మారింది.
ఒకేసారి హాస్పిటల్‌కు
కరీనా కపూర్, కరిష్మా కపూర్‌కు మలైకా అరోరా బెస్ట్ ఫ్రెండ్. బాలీవుడ్‌లో ఉన్న ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఈ ముగ్గురు కూడా ఉంటారు. ఇక అర్జున్ కపూర్ సైతం అదే ఫ్యామిలీకి చెందినవాడు. దీంతో వీరిద్దరూ కలిసి సైఫ్ అలీ ఖాన్ గురించి తెలుసుకోవడానికి నేరుగా హాస్పిటల్‌కు వచ్చారు. హాస్పిటల్‌కు వచ్చిన సమయంలో వారి ప్రవర్తన చాలా మామూలుగానే ఉందని, అంటే మళ్లీ కలిసిపోయే ఛాన్సులు ఉన్నాయా అని అందరిలో సందేహం మొదలయ్యింది. నిజంగానే వీరిద్దరూ కలిసిపోతే బాగుంటుందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అర్జున్ కపూర్, మలైకా బ్రేకప్ అయ్యి చాలారోజులు అయినా ఇంకా దీనికి కారణం ఏంటో బయటికి రాలేదు.
Also Read: విడాకుల బాటలో స్టార్ సింగర్… మొన్న మామను, ఈరోజు భార్యను అన్ ఫాలో
ఆరేళ్ల తర్వాత
2018 నుండి అర్జున్ కపూర్ (Arjun Kapoor), మలైకా అరోరా (Malaika Arora) రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వారి ప్రేమ గురించి వారే స్వయంగా ఒప్పుకున్నారు. బాలీవుడ్‌లో తర్వాత పెళ్లి పీటలెక్కబోయే జంట వీరిదే అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. అలాంటిది 2024లో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఈ విషయాన్ని ముందుగా అర్జున్ కపూరే అనౌన్స్ చేశాడు. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న అర్జున్ కపూర్.. తాను ఇప్పుడు సింగిల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో వీరి ప్రేమ విషయం బయటపడింది. కానీ మలైకా మాత్రం ఇప్పటివరకు ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ తాను షేర్ చేసే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు బ్రేకప్‌కు సంబంధించినవే అని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు.