BigTV English

Alekhya Chitti : పచ్చళ్లు అమ్మి ఫేమస్ అవ్వడం… సినిమాల్లోకి రావడం.. ఇదేక్కడ చూడలేదు..

Alekhya Chitti : పచ్చళ్లు అమ్మి ఫేమస్ అవ్వడం… సినిమాల్లోకి రావడం.. ఇదేక్కడ చూడలేదు..

Alekhya Chitti : తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పీకిల్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసు.. గత కొద్దిరోజులుగా అలేఖ్య సిస్టర్స్ పేర్లు నిత్యం ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉన్నారు.. పచ్చళ్ల రేటు ఓ కస్టమర్ నార్మల్‌గా అడిగితే.. అవతలి నుంచి వచ్చిన సమాధానం విని సోషల్ మీడియా, సమాజం మొత్తం నోరెళ్లబెట్టేసింది. ఏంటి? రేటు అడిగితే ఈ రేంజ్‌లో తిట్టాలా? అని ఓ ఆట ఆడేసుకున్నారు. దీంతో ఆ ముగ్గురు సిస్టర్లు దారికొచ్చారు.. మొత్తానికి హాస్పిటల్ బెడ్ ఎక్కి మరి మాదే తప్పు క్షమించండి. అంటూ క్షమాపణలు చెప్పారు.. అయినా కూడా నెట్టింట ట్రోల్స్ ఆగడం లేదు. మొన్నేమో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం తాజాగా ఓ ఈవెంట్లో అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు మెరిశారు.. దాంతో ఈ వార్తలు నిజమేనని కొందరు నమ్ముతున్నారు.. అయితే అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సినిమాల్లోకి అలేఖ్య సిస్టర్..

తెలుగు రాష్ట్రాల్లోని గోదారి జిల్లాల్లో అలేఖ్య చిట్టి పీకేల్స్ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. తమ తండ్రి ద్వారా పచ్చళ్ళ బిజినెస్ ని మొదలుపెట్టిన ముగ్గురు అక్క చెల్లెలు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.. కస్టమర్ కు ధరింత అని అడిగినందుకు బూతులు తిట్టడంతో ఈ చిట్టి పీకిల్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి. దీనిపై అక్క చెల్లెలు క్లారిటీ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఏదో ఒకరకంగా నెట్టింట ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. పచ్చళ్లు అమ్ముతూ ఇంకొకరు ఇలా బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. అందులో రమ్య అయితే తన హాట్ హాట్ రీల్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తుంటుంది. ఇక ఆలేఖ్య చిట్టి పికిల్స్‌కు ఒక రకంగా రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు.. ఈమె సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో బాగా ఫేమస్ అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే రమ్య వల్లే తమ బిజినెస్ పెరిగింది. మొన్న బిగ్ బాస్ లోకి రాబోతున్నారంటు వార్త వినిపిస్తున్నాయి.. ఇప్పుడేమో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఓ సినిమాలు ఈవెంట్లో మెరిసింది. అందుకే వార్తలు ఊపందుకున్నాయి..


సినిమా ఈవెంట్లో రమ్య సందడి..

అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య సోషల్ మీడియాలో బాగా ఫెమస్.. రమ్య పెట్టే రీల్స్, వేసే స్టెప్పులకి జనాలు ఫిదా అవుతుంటారు. ట్రోలింగ్ చేస్తూ ఉన్నా, నెటిజన్లు బూతులతో రెచ్చిపోతూ ఉన్నా కూడా వాటికి ఘాటుగా సమాధానాలు ఇస్తూనే వెళ్తుంటుంది రమ్య. ఇక ఇప్పుడు ఈమె సినిమా ఈవెంట్లో మెరిసింది.. ఆ ఈవెంట్ వీడియోని నెటిజన్లు కట్ చేసి రమ్య సినిమాల్లోకి రాబోతుంది అంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.. రమ్య చిట్టి పీకిల్స్ అక్కచెల్లెలను ఈ స్థాయి రేంజ్కి ఎదగడానికి కారణం నెటిజెన్లు, ట్రోలర్స్.. సోషల్ మీడియాలో వీరిపై రకరకాల పోస్ట్లు పెట్టడంతో వీరి క్రేజ్ అమాంతం పెరిగేసింది. అలా ఇప్పుడు రాజమండ్రి నుంచి రోల్ మోడల్ అయిపోయారు..

Also Read : నాకు పెళ్లికాకుంటే అతనికి అది చేసేదాన్ని.. అనసూయ ఓపెన్ కామెంట్స్..

అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్ మూవీ ఈవెంట్ గురువారం నాడు జరిగింది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రమ్య కనిపించింది. సినిమా ఈవెంట్లో ఏమైనా కనిపించడంతో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందేమో అని చాలామంది చెవుల కొరుక్కుంటున్నారు. మరి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ భామ ఇకపై టాలీవుడ్‌లోనే తన కెరీర్‌ను చూసుకుంటుందా? లేదంటే ఎప్పటిలానే ఇన్స్టాల్ వీల్స్ తో తన పచ్చళ్ళ బిజినెస్ ని పెంచుకుంటుందా అన్నది చూడాలి.. ఏమైనా కూడా ఎక్కడో పచ్చళ్ళు అమ్ముకుంటున్న రమ్య ఇప్పుడు సినిమా వాళ్లతో కనిపించడం.. అది కూడా తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కనిపించడంతో ఆమె క్రేజీ ఎక్కడికో వెళ్లిందని చెప్పాలి. ఇక త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇకముందు ఆ వార్తను కూడా వినాల్సి వస్తుందేమో చూడాలి..

?igsh=MXg5anltZDBrNHg4aQ==

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×