Anasuya Bharadwaj : బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా వరుస షోలు చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు ఈమధ్య సినిమాల్లో సత్తాని చాటుతుంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడంతో బుల్లితెరక గుడ్ బై చెప్పిన యాంకర్ అమ్మ సినిమాల్లో బిజీగా ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు అటు తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా అనసూయకు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ వయసులో కూడా అనసూయ అందానికి ఫిదా అవని వాళ్ళు ఉండరు.. అలాగే పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. అదేగా సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది అనసూయ. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది.. అసలు ఏం అడిగారు? అను ఏం చెప్పిందో? కాస్త వివరంగా తెలుసుకుందాం..
అనసూయ సినిమాలు..
యాంకర్, సినీ నటి అనసూయ ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉంది. జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ .. పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మంచి మార్కులు పడ్డాయి. ఆ మూవీ భారీ హిట్ అవడంతో అనసూయకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ అమ్మడు కు ఆఫర్స్ ఎక్కువగా రావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది అన్న విషయం తెలిసిందే.. 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది.. వయసు పెరుగుతున్న కూడా అమ్మడు అందం తగ్గలేదు. అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో నెటిజెన్స్ తో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Also Read : రాజమౌళి-మహేష్ బాబు మూవీలో విలన్ ఫిక్స్..?
ఆ హీరో తో ఆ పనిచేస్తాను..?
అనసూయ తన ప్రొఫెషన్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో అంతే ఎక్కువగా గడుపుతుంది. గ్యాప్ దొరికితే వెకేషన్ లోకి వెళ్తూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. గతంలో బికినీలో దిగిన ఫోటోలను అనసూయ షేర్ చేసింది. ఫోటోలు నెట్టింట ఎంత దుమారం లేపయో తెలిసిందే.. నాఒళ్లు నా ఇష్టం అని అనసూయ అనడంతో ఆ తర్వాత రూమర్స్ కు చెక్ పడింది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ తన ఫాన్స్ సోషల్ మీడియాలో చాట్ చేసింది.. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీరు ఏ హీరోతో డేట్ చేస్తారని అడిగారు. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తావు అని అడిగిన ప్రశ్నకు ధైర్యంగా సమాధానం చెప్పింది అనసూయ. నాకు పెళ్లి కాకపోయి ఉంటే మెగా హీరో రామ్ చరణ్‌తో డేటింగ్ చేసేదాన్ని అని సమాధానంగా ఇచ్చింది అనసూయ.. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..