BigTV English

Ram NRI Grand Pre Release: ‘ఫీల్ గుడ్ మూవీ ‘రామ్ ఎన్ఆర్ఐ’.. లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు’

Ram NRI Grand Pre Release: ‘ఫీల్ గుడ్ మూవీ ‘రామ్ ఎన్ఆర్ఐ’.. లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు’

Ram NRI Movie grand Pre Release Event: ఈ నెల 26న విడుదల కాబోతున్న ‘రామ్ ఎన్ఆర్ఐ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ, రామ సత్య నారాయణతోపాటు పలువురు ఈ వెంట్‌కు చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎంతో కష్టపడి రూపొందించారు.. చిత్ర బృందానికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేశ్, దగ్గుబాటి పురందేశ్వరి, కోమటిరెడ్డి ఆశీస్సులు ఉంటాయన్నారు. అనంతరం ఎన్. లక్ష్మీ నందా మాట్లాడారు. తనకు సపోర్ట్ చేసిన టీమ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సొంతూరుకు ఏదైనా చేయాలన్న తలంపు ఉన్నవాళ్లంతా ముందుకు వచ్చి  ఈ ఈవెంట్‌ను సక్సెస్ చేశారన్నారు. సినిమా సూపర్బ్‌గా ఉంది.. అందరూ చూసి ఆదరించాలంటూ రిక్వెస్ట్ చేశారు.

సింగులూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. జులై 26న ఈ సినిమా విడుదల కాబోతున్నది. శతమానం భవతి, ఉయ్యాల జంపాల సినిమాల మాదిరిగా ఈ సినిమా ఉంటుంది. ఎస్ఎంకే ఫిల్మ్స్ బ్యానర్‌పై సంవత్సరానికి ఆరు సినిమాలైన విడుదల చేయాలని అనుకుంటున్నాం. లక్ష్మీ నందా గారితో ఓ సోలో మూవీని చేస్తున్నాను. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తాని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.


Also Read: ఆయన మరణం.. కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది

‘సినిమాను రూపొందించడం కంటే విడుదల చేయడం చాలా కష్టం. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాను లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల బేస్డ్‌గా ఈ సినిమా తీశారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. మోహనకృష్ణ నిర్మాతలకు గ్యాంగ్ లీడర్ కావాలని కోరుతున్నాను. ‘రామ్ ఎన్ఆర్ఐ’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ లయన్ సాయి వెంకట్ పేర్కొన్నారు. పాటలు, ట్రైలర్.. అన్నీ బాగున్నాయని, ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఇది గోదారోళ్ల సినిమా.. గోదారి అందాలను ఎంతో అందంగా చూపించారు ఈ మూవీలో.. కచ్చితంగా సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంటుందని రామసత్యనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రొడ్యూసర్ మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ఈ మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ తీశాం. చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా’ అంటూ ఆయన ఆకాంక్షించారు.

ఆ తరువాత నటుడు రవి వర్మ మాట్లాడారు. ‘నాకు డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నాను. పుట్టిన ఊరుకు ఏదో చేయాలనే తలంపుతో ఈ సినిమాను తీశారు. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.. చూసి ఆదరించండి’ అని రవి వర్మ చెప్పారు. కొత్త టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం భారీ విజయాన్ని అందుకోవాలి.. ఇలాంటి కొత్తవాళ్లు సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటూ పలువురు ఇతర అతిథులు మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కాగా, మువ్వా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రజా హీరోగా, సీతా నారాయణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ ఈ సినిమా ట్యాగ్ లైన్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×