BigTV English

Alia Bhatt: ప్రపంచంలోనే రెండవ స్థానం అందుకున్న ఆలియా భట్.. పూర్తి వివరాలివే.!

Alia Bhatt: ప్రపంచంలోనే రెండవ స్థానం అందుకున్న ఆలియా భట్.. పూర్తి వివరాలివే.!

Alia Bhatt:బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) బాలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు రాజమౌళి (Rajamouli ) దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో కూడా ఫేమస్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో అలియాభట్ పాత్రకి కొద్ది స్పేస్ ఉన్నప్పటికీ సీత పాత్రలో అద్భుతంగా నటించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన అభిమానులతో తన సినిమాలకు సంబంధించి అలాగే తన పర్సనల్ విషయాలకు సంబంధించి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే అలాంటి సోషల్ మీడియాలోనే అరుదైన రికార్డును సాధించింది అలియా భట్.మరి ఇంతకీ ఇంస్టాగ్రామ్(Instagram ) లో అలియా భట్.. మరి ఇంతకీ ఆలియా భట్ సాధించిన ఆ అరుదైన రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


సోషల్ మీడియాలో అరుదైన రికార్డ్..

చాలామంది నటీనటులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతున్నారు. ఏ విషయాన్నైనా సరే సోషల్ మీడియా ద్వారానే బయటపెడుతున్నారు. అలా సినిమా ప్రమోషన్స్ కోసమైనా లేదా తమ పర్సనల్ విషయాలు ఏదైనా సరే చెప్పడానికి సోషల్ మీడియానే బెస్ట్ ఫ్లాట్ ఫారం గా ఎంచుకుంటున్నారు. అలా ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక ఇంస్టాగ్రామ్,ట్విట్టర్,ఫేస్ బుక్ అంటూ ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాగే ఫాలోవర్స్ విషయంలో కూడా కోట్లాదిమందిని సంపాదించుకుంటున్నారు. అయితే తాజాగా అలియా భట్ ఇంస్టాగ్రామ్ లో ఒక అరుదైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. ఇంస్టాగ్రామ్ లో అలియా భట్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే అలాంటి ఇంస్టాగ్రామ్ ద్వారానే ఒక రికార్డు క్రియేట్ చేసింది.


అత్యంత ప్రతిభావంతురాలిగా ప్రపంచంలోనే రెండవ స్థానం..

తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫార్మ్ హైప్ ఆడిటర్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నటిగా 2 స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ జాబితాలో జెన్నీఫర్ లోపేజ్, డ్వేన్ జాన్సన్ వంటి వారిని కూడా వెనక్కి నెట్టి అలియా భట్ ప్రపంచంలోనే 2 వ అత్యంత ప్రభావవంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో.. అరుదైన రికార్డును సాధించిన హీరోయిన్ గా ఇంస్టాగ్రామ్ లో అలియా భట్ సంచలనం క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక అలియా భట్ క్రియేట్ చేసిన ఈ విజయం మన ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక అద్భుతమైన విజయం అని చెప్పుకోవచ్చు. అలియా భట్ ఇంస్టాగ్రామ్ లో 85 మిలియన్ ఫాలోవర్లను సంపాదించి నిత్యం నెట్టింట్లో యాక్టీవ్ గా ఉంటూ ఈ అరుదైన రికార్డును సాధించింది. ఇక అలియా భట్ విషయానికి వస్తే ఒకవైపు బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే చిన్నపిల్లలకు సంబంధించిన నాణ్యమైన బట్టలను తన వెబ్సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తన ప్రియుడు రన్బీర్ కపూర్ ను వివాహం చేసుకున్న ఈమె ఒక పాపకి కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×