Kiran Abbavaram: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలు పెట్టిన కిరణ్ రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో తనలో ఉన్న రచయితను కూడా బయటికి తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా హిట్ అవడంతో కిరణ్ కు వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. ఏది వదలకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిపోయాడు. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిరణ్ అబ్బవరం సినిమాలో ఆడియన్స్ కి బోరు కొట్టడం మొదలుపెట్టాయి. ఇది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాస్తవం అని చెప్పాలి. ఈ రిలైజేషన్ హీరో కూడా వచ్చింది. అందుకే గ్యాప్ తీసుకొని క సినిమాతో కాన్సెప్ట్ బేస్డ్ కమర్షియల్ హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ వద్ద క సినిమా సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ విడిచి వెళ్ళిపోతాను అని చాలా కాన్ఫిడెంట్ గా సవాలు చేశాడు. ఎట్టకేలకు ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొత్తానికి కిరణ్ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు.
ఇక ప్రస్తుతం కిరణ్ మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దిల్రూబ. ఈ సినిమాకి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి హే జింగిలియా అనే పాటను జనవరి 18వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జనవరి 18న రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ గురించి ఇప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే సినిమా హీరోయిన్ రుక్సార్ ఓయ్ కిరణ్ అబ్బవరం ఇంకేమీ దొరకనట్లు బుజ్జి బంగారం కాకుండా ఈ జింగిలి జింగిలి ఏంటి అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
ఆ ట్వీట్ కి కిరణ్ అబ్బవరం సమాధానం ఇస్తూ జనాలు పిలుచుకునే పూకి, కుకి, వైఫు లు కంటే కూడా జింగిలి చాలా బాగుంటుందిలే అని సమాధానం ఇచ్చాడు. దీనికి అదంతా కాదు జింగిలి అంటే ఏంటో ముందు అది చెప్పు అంటూ అడిగింది ఒకసారి. ఆ మాటకు సమాధానంగా ఒక్కో లెటర్ కి ఉన్న అర్ధాన్ని ట్విట్టర్ వేదిక రాసుకొచ్చాడు. లాస్ట్ లో మాత్రం ఇవన్నీ కాదు గాని రేపు సాంగ్ వచ్చాక విను అంటూ ట్వీట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 14న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. క సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం. తన కెరియర్ ను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో ఈ సినిమాతో తెలియనుంది. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన ఫస్ట్ సింగల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాట ఎలా ఉంటుందో రేపు తెలియనుంది.
Ee madhya janaalu pilchukunne pookie, cookie, Waifu lu kanna JINGILI chaala baguntaadhi le.#HeyJingili https://t.co/9FEXgMjd27
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 17, 2025