Mysore Incident: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా పడిఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణం అయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. మైసూర్‌లోని విశ్వేశ్వరయ్య నగర్ పరిధిలో సంకల్ప్ సెరీన్ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్న వ్యాపారి చేతన్(45), అతని సతీమణి రూపాలి(43,)కుమారుడు కుశాల్(15), తల్లి ప్రియంవద(65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ప్రాథమిక విచారణలో.. చేతన్ మొదట తన భార్య, కుమారుడు, తల్లికి విషం ఇచ్చి చంపిన తర్వాత, తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
ఆత్మహత్యకు ముందు చేతన్ యూఎస్‌లో ఉన్న సోదరుడికి కాల్ చేసి, తాను చాలా ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని, ఇంకా ఆ భాధను తట్టుకోలేకపోతున్నానని, అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం అతని సోదరుడికి అనుమానం వచ్చి, వెంటనే బంధువులకు సమాచారం అందించాడు.
చేతన్ నివాసానికి చేరుకున్న బంధువులు వచ్చి చూసేసరికి.. వారంతా విగతజీవులుగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. దీంతో వెంటనే పోలీసులుకు సమాచారం అందించడంతో.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
Also Read: బెట్టింగ్ ఉచ్చులో సతీష్, ఆపై సెల్ఫీ వీడియో, ఏం జరిగింది?
చేతన్ కుటుంబ సభ్యులు గత పదిసంవత్సరాలుగా ఈ అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, వాళ్లు ఎప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లు బయటపడలేదని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఏదైనా కారణం ఉందా లేకా.. ఆర్ధిక ఇబ్బందులో కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.