Alia Bhatt: చాలామంది హీరో హీరోయిన్లు తమకు పుట్టిన పిల్లలకు సంబంధించి ఫోటోలను ఎక్కువగా బయట పడనివ్వరు. వారికి 2,3 సంవత్సరాల వయసు వచ్చేవరకు కూడా వారి ఫోటోలు ఎక్కడ కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కూతురు క్లీంకార విషయంలో ఇది గమనించాం. క్లీంకారా (Klinkaara) ని మీడియాకి చూపించడానికి ఇప్పటికీ కూడా రామ్ చరణ్ ఇష్టపడడం లేదు. ఇక ఆ మధ్యకాలంలో బాలకృష్ణ (Balakrishna) షో లో “నా కూతురు నాన్న అని పిలిచిన సమయంలోనే ఆమె ఫేస్ ని చూపెడతాను” అని అన్నారు.కానీ అప్పుడప్పుడు ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయట పడుతూ ఉంటాయి. కానీ క్లియర్ కట్ గా ఆమె ఫేస్ ఎక్కడా కూడా కనిపించలేదు.కానీ మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమకి పుట్టిన పిల్లలకు సంబంధించి ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అలా ఇలియానా(Ileana), అలియా భట్ వంటి కొంతమంది సెలబ్రిటీలు తమ పిల్లల ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇంస్టాగ్రామ్ నుండి తన కూతురు ఫోటోలు డిలీట్ చేసిన అలియా..
అయితే అలియా భట్ తన కూతురు రాహా(Raha) కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఇన్ని రోజులు తన కూతురి ఫోటోలు షేర్ చేసిన అలియా భట్.. ఎందుకు ఇంత పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుంది..? అసలు కూతురు ఫోటోలు ఎందుకు తన సోషల్ మీడియా ఖాతా నుండి డిలీట్ చేసింది? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి అలియా భట్(Alia Bhatt) తన కూతురు ఫొటోస్ డిలీట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. రణబీర్ కపూర్(Ranbir Kapoor) అలియా భట్ దంపతులకు రాహా 2022లో జన్మించింది. ఇక రణబీర్, అలియాల వివాహం 2021 లో జరిగింది.అయితే పెళ్లయిన 7 నెలలకే పాప పుట్టడంతో అలియా భట్, రణబీర్ దంపతులపై చాలానే విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలు పక్కన పెడితే, కూతురు పుట్టాక ఎంతో హ్యాపీగా రణబీర్, అలియా భట్ లు తమ కూతుర్ని చూసుకుంటున్నారు. కొద్ది రోజులకే అలియా తన కూతురి ఫేస్ ని అభిమానులకి చూపించింది. అయితే అలియా భట్ తన కూతురికి సంబంధించిన ఎన్నో క్యూట్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.కానీ సడన్గా ఈ ఫొటోస్ డిలీట్ చేసింది.
సైఫ్ అలీ ఖాన్ వల్లేనా..?
దానికి కారణం సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) పై జరిగిన కత్తి దాడే అని తెలుస్తోంది. అయితే తాజాగా కొంతమంది నెటిజన్స్ సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరగడంతో ఆ దాడిని ఉదాహరణగా తీసుకున్న అలియా భట్.. తన కూతురు సంరక్షణ కోసం ఆ ఫొటోస్ డిలీట్ చేసింది అని చర్చించుకుంటున్నారు. కానీ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆలియా భట్ ఏ ఉద్దేశంతో ఆ ఫోటోలు డిలీట్ చేసిందో తెలియదు కానీ.. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో అలియా భట్ నిర్ణయాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. పిల్లల విషయంలో గోప్యత పాటించడం మంచిదే అని కామెంట్లు పెడుతున్నారు.మరి రాహా ఫోటోలను డిలీట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో అలియా భట్ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.