BigTV English
Advertisement

Bachhala Malli Twitter Review: ‘ బచ్చలమల్లి ‘ ట్విట్టర్ రివ్యూ.. జనాల రియాక్షన్ ఏంటంటే?

Bachhala Malli Twitter Review: ‘ బచ్చలమల్లి ‘ ట్విట్టర్ రివ్యూ.. జనాల రియాక్షన్ ఏంటంటే?

Bachhala Malli Twitter Review: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. నాంది సినిమా తర్వాత ఆయన యాక్షన్ సినిమాల్లో విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. నరేష్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న సినిమా బచ్చల మల్లి అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో ఈ మూవీ ఇవాళ థియేటర్లలోకి అడుగు పెట్టేసింది.. హైదరాబాద్ సిటీ, అమెరికాలో కొన్ని లొకేషనల్లో పెయిడ్ ప్రీమియర్లు వేశారు. సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? అసలు జనాల రియాక్షన్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి చూసేద్దాం..


ఈ మూవీకి డైరెక్టర్ సుబ్బు మంగాదేవి సెలెక్ట్ చేసుకున్న స్టోరీ కోర్ పాయింట్ బావున్నప్పటికీ… ఆయన తీసిన తీరు బాలేదని, రొటీన్ స్క్రీన్ ప్లేతో తీయడం వల్ల సోల్ మిస్ అయ్యిందని కొంత మంది నెటిజనులు పేర్కొంటున్నారు.. నరేష్ యాక్టింగ్ మరోసారి అదిరిపోయింది. రూరల్ డ్రామాల్లో మనం చూసే సన్నివేశాలు చాలా ‘బచ్చల మల్లి’ సినిమాలో ఉన్నాయని నెటిజన్స్ చెబుతున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రామిసింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ సరిగా తీయలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దాంతో సినిమా ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదని తేల్చేశారు.

సినిమా చాలా సత్యమైన ఆవరణను కలిగి ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో ఉత్సాహం లేకపోవడం దాని లోతును తగ్గిస్తుంది మరియు దాని మొత్తం ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. అల్లరినరేష్ తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. అమృతఅయ్యర్ బాగానే ఉన్నారు. ఆమె నటనకు మార్కులు పడ్డాయి.

బచ్చల మల్లి క్యారెక్టర్లో నరేష్ యాక్టింగ్ అదరగొట్టారని నెటిజనులు చెబుతున్నారు. ఈ విషయంలో మిక్స్డ్ టాక్ ఏమీ లేదు. సినిమా బాలేదని చెప్పిన జనాలు సైతం నరేష్ నటనను మెచ్చుకుంటున్నారు. అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ అయితే ఆయన కెరీర్ లో వన్నాఫ్ ది బెస్ట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.. ఇక ఆయనే సినిమాకు బ్యాక్ బొన్ అయ్యాడు. ఇక మరొకరు నరేష్ నటనకు మరోసారి ఫిదా అవ్వాల్సిందే.. న్యాచురల్ గా ఉందని అంటున్నారు.

కొందరు పాజిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ రివ్యూలో కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. మొత్తానికి మూవీ యావరేజ్ టాక్ ను అందుకుందని అర్థమవుతుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×