BigTV English

Sobhita Akkineni:పెళ్లి పీటల మీదే అల్లు అరవింద్ కు శోభితా రిక్వెస్ట్.. దాన్ని చూడలేకపోతున్నా అంటూ

Sobhita Akkineni:పెళ్లి పీటల మీదే అల్లు అరవింద్ కు శోభితా రిక్వెస్ట్.. దాన్ని చూడలేకపోతున్నా అంటూ

Sobhita Akkineni: అక్కినేని నాగచైతన్య మొదటిసారి తండేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లబోతున్నాడు. ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఈ ప్రమోషన్స్ లో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొంటున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చై సరసన సాయిపల్లవి  నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన  ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తండేల్ సినిమాపై చై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.


చై  తండేల్ కోసం ఎంత కష్టపడ్డాడో చందూ మొండేటి చెప్తూనే వస్తున్నాడు. సెట్ వేద్దామన్నా కూడా వద్దని, రియలిస్టిక్ గా  ఉంటుందని  సముద్రంలోనే షూటింగ్ చేసినట్లు తెలిపాడు. అక్కడ వాతావరణం బాగోకపోయినా.. ఫుడ్ పాడకపోయినా కూడా చై వెనుకడుగు వేయకుండా షూటింగ్ ను పూర్తిచేసినట్లు తెలిపాడు. ఇక అల్లు అరవింద్ సైతం చైకు కెరీర్ బెస్ట్ సినిమా అని.. ఆయన నటన చూసి తానే ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అంతేకాకుండా  చై గడ్డం గురించి శోభితా రిక్వెస్ట్ చేసిందని కూడా చెప్పుకొచ్చారు.

“నాగచైతన్య- శోభితా పెళ్లి ఈ మధ్యనే జరిగింది. వారి పెళ్ళికి కూడా నేను వెళ్లాను. పెళ్లి పీటల మీద  శోభితాను నాకు పరిచయం చేశాడు. ఆమె నన్ను చూసిన వెంటనే ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగింది. ఏంటమ్మా అంటే..  మా ఆయనను  నా భర్త ఫేస్ ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఈ గడ్డం వల్ల నా భర్త ఫేస్ ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తండేల్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే  నువ్వు నీ భర్తను గడ్డం లేకుండా చూడొచ్చు అని చెప్పానని” తెలిపారు.


Tanya Ravichandran: అప్పుడు ఎంత హోమ్లీగా ఉండేది.. ఇప్పుడీ క్లివేజ్ షో ఏంటి.. ఆ థైస్ చూపించడం ఏంటి.. ?

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో చై తన లుక్ గురించి మాట్లాడుతూ..” నాకెప్పుడూ ఈ గడ్డం తీయాలని అనిపించలేదు. ఏడాదిన్నర ఈ సినిమా షూటింగ్ చేశాను. ఎప్పుడైనా ఈ గడ్డం  తీయాలని కానీ, హెయిర్ కట్ చేయాలనీ కానీ అనిపించలేదు. చిరాకుగా కూడా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే షూటింగ్ ఎక్కువరోజులు చేయాలనిపించింది. సెట్ లో అందరూ నన్ను తిడతారేమో అని ఆగాను కానీ, ఇంకో నెల షూటింగ్ చేయమన్నా చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.

ఇక శోభితా  గురించి చెప్పాలంటే.. తెనాలిలో పుట్టినా ఆమె వైజాగ్ లో పెరిగింది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన శోభితా రెండేళ్లు చైతో డేటింగ్ చేసి గతేడాది డిసెంబర్ 4 న పెద్దల అంగీకారంతో చైను వివాహమాడింది. పెళ్లి తరువాత శోభితాతో తన లైఫ్ బావుందని, తమ ఇద్దరి ఇష్టాలు ఒకటే అని చై చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఏ విషయంలోనైనా తన నిర్ణయం ఉంటుందని తెలిపాడు. మరి చై తండేల్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలంటే  ఇంకోవారం ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×