Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే… గత ఏడాది కాలంలో.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన ఫాంలో లేక సతమతమౌవుతున్నాడు. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టింది. అంతర్జాతీయ ప్లేయర్లందరూ… రంజీ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ పేర్కొంది. దీంతో… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా రంజీలు మొదలు పెట్టాడు. చాలా కాలం తర్వాత అంటే 13 ఏళ్ల అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.
Also Read: Hardik Pandya: బలుపు అన్నారు కదరా… దుమ్ములేపి చూపించా !
మరి ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడడానికి విరాట్ కోహ్లీ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి టీమిండియాకు ఆడే ప్లేయర్స్ వార్షిక కాంట్రాక్టుల రూపంలో కోట్ల రూపాయలను జీతాన్ని అందుకుంటారు. కానీ ఈ రంజీలలో అలా కాదు. దేశవాళీ కావడంతో బీసీసీఐ చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తుంది. అంటే 21 నుంచి 40 మ్యాచుల అనుభవం ఉన్న ప్లేయర్స్ రోజుకి రూ. 50,000 అందుకుంటారు. అంటే ఒక మ్యాచ్ కి రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ తో పోలిస్తే రంజీల్లో తక్కువ డబ్బులు వస్తాయి.
రంజీల్లో ( Ranji Match ) కోహ్లీ ఇప్పటి వరకు 23 మ్యాచులు ఆడాడు. ఈ సమయంలో అతను 1547 పరుగులు చేశాడు. ఇందుకు గాను అతనికి ( Virat Kohli Ranji Fee ) రోజుకు కేవలం రూ. 60,000 మ్యాచ్ ఫీజు మాత్రమే వస్తుంది. 23 మ్యాచ్ లు ఆడినా.. కోహ్లీకి రూ. 60,000 చోప్పున నాలుగు రోజులకు రూ. 2,40,000 ఇస్తున్నారు. టీమిండియా ఏ ప్లస్ గ్రేడ్ ప్లేయర్ల జాబితాలో కోహ్లీ చోటును దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున ఆడేందుకు కోహ్లీకి బీసీసీఐ ఏటా 7 కోట్లు ఇస్తుంది. ఒక టెస్ట్ కు బీసీసీఐ 15 లక్షలు చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు కోహ్లీకి రంజీల్లో తక్కువ మ్యాచ్ ఫీజు తీసుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి బ్యాడ్ ఫామ్ తో కొనసాగుతున్నారు.
2024 సంవత్సరం కోహ్లీకి అసలు కలిసి రాలేదు. గతేడాది టీ20 ప్రపంచ కప్ లో కూడా విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శనతోనే నెట్టుకొచ్చాడు. అయితే టైటిల్ మ్యాచ్ లో మాత్రం విరాటపర్వం చూపించి జట్టుకు భారీ స్కోర్ ఇచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా కింగ్ కోహ్లీ ఎలాంటి పరుగులు చేయలేకపోయాడు. ఆ తర్వాత రంజీల్లో ఆడాలని బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లను ఆదేశించింది. రోహిత్ శర్మ ముంబై తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఢిల్లీకి ఆడుతున్నాడు. ఇందులో కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు.
Also Read: Kevin Pietersen: 12 మందితో ఆడి గెలిచారు.. ఇది మగతనం కాదు ?
బీసీసీఐ రూల్స్ ప్రకారం…