Meenakshi Chaudhary : ప్లీజ్ దయచేసి నాకు బర్త్ డే విషెస్ చెప్పొద్దు అంటూ ఫ్యాన్స్ ను వేడుకుంటుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) హీరోయిన్ మీనాక్షి చౌదరి. అసలు ఈ హీరోయిన్ కు ఏమైంది? ఎందుకు ఇలా అంటుందంటే..!
‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకునున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. తాజాగా ఈ భామ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగులో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ కొట్టేసింది మీనాక్షి. సోషల్ మీడియాలో సైతం ఈ భామకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ రిక్వెస్ట్ పెట్టేసింది మీనాక్షి. “ప్లీజ్.. నాకు ఎవరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పొద్దు..” అంటూ స్టేటస్ షేర్ చేసింది. అసలు ఇలా ఎందుకు పోస్ట్ పెట్టిందంటే.. నిజానికి తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 కాదంట.. మార్చి 5న అంట.. కానీ ఈ విషయం తెలియని ఆమె ఫ్యాన్స్ ఈ రోజే అనుకుంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. బర్త్డే విషెస్ చెప్పడమే చెప్తూ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. దీంతో ఇక చేసేదేం లేక అసలు విషయం చెప్పేసింది ఈ సుందరి.
ALSO READ : లేడీ ఫ్యాన్ కు లైవ్ లో లిప్ లాక్.. వివాదం పై స్పందించిన ప్రముఖ సింగర్..!
ఇక ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఎన్నో ప్రత్యేక పాత్రల్లో కనిపించిన మీనాక్షి చౌదరి.. తాను ఫలానా పాత్రలే చేయాలని ఎలాంటి పరిమితులు పెట్టుకోనని తెలిపింది. వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేయాలనుకునే నటిని కాదని, ఓకే తరహా పాత్రలు చేస్తే స్క్రీన్ పై ఫ్యాన్స్ కు బోర్ కొట్టేస్తానని వెల్లడించింది. వైవిధ్యమైన పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్న మీనాక్షి చౌదరి.. తనను తాను సవాల్ చేసుకోవడం ఎంతో పలు సందర్భాల్లో వెల్లడించింది.
తెలుగులో ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించిన మీనాక్షి.. తమిళంలో ‘కొలై’, ‘సింగపూర్ సలూన్’, ‘ది గోట్’ వంటి చిత్రాల్లో నటించింది. విజయ్‌తో కలిసి ‘ది గోట్’ మూవీలో నటించింది. ఈ సినిమాకు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్న ఈ హీరోయిన్ ఆపై పలు ఆకట్టుకునే పాత్రల్లో కనిపించి అలరించింది.
లక్కీ భాస్కర్ లో తొలిసారి అమ్మ పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూ ప్రేమను పంచే పాత్రలో కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లో సైతం డిఫరెంట్ రోల్స్ లో కనిపించింది. ఇక తాజాగా వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ఇది బెస్ట్ గా నిలిచింది. ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరికి మంచి పేరు సంపాదించి పెట్టేసింది