BigTV English

Allu Arjun: ఇట్ ఈజ్ అన్‌బిలీవబుల్.. హాలీవుడ్‌ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గేలా లేదు..!

Allu Arjun: ఇట్ ఈజ్ అన్‌బిలీవబుల్.. హాలీవుడ్‌ రేంజ్‌కి ఏ మాత్రం తగ్గేలా లేదు..!

Allu Arjun – Atlee : సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ కోసం అభిమానులే కాదు సినీ లవర్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకొని, తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో సినిమాని కన్ఫామ్ చేస్తూ.. ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఊహించని రేంజ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో ఊహకు అందని ఆలోచనలను క్రియేట్ చేస్తోందని వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.


అంచనాలు పెంచేస్తున్న అనౌన్స్మెంట్ వీడియో..

భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సన్ పిక్చర్స్ బ్యానర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.#AA22 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో విషయానికి వస్తే.. మొదట చాలా లగ్జరీగా అల్లు అర్జున్ , అట్లీ తమ తమ కార్లలో సన్ పిక్చర్స్ ఆఫీస్ కి చేరుకుంటారు. అక్కడ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ తో మూవీ చర్చలు జరిపినట్లు మనం చూడవచ్చు. ఇకపోతే ఇదే వీడియోలో ఈ సినిమా కోసం ఎవరెవరు పనిచేయబోతున్నారు అనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్, అట్లీ ఈ మూవీ కోసం లాస్ ఏంజిల్స్ లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లతోనే అట్లీ సినిమాను తీస్తున్నారు. ఇందుకోసం లాస్ ఏంజెల్స్ లోని అతిపెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీతో చర్చలు కూడా జరిపారు. దీన్నంతా చూస్తూ ఉంటే ఈ ప్రపంచానికి మరో కొత్త సూపర్ హీరోని అట్లీ అందించేలా కనిపిస్తున్నారు.


అట్లీ కథకు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఫిదా..

దీనికి తోడు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా అట్లీ చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, ఇంతవరకు ఆ రేంజ్ లో కథను వినలేదని చెబుతున్నారు. ఇక అన్ని చూస్తూ ఉంటే అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ ను కూడా బీట్ చేసేలా ఉందని తెలుస్తోంది. అంతేకాదు అవతార్ రేంజ్ లో గ్రాఫిక్స్, అవేంజర్స్ తోపాటు భారీ గ్రాఫిక్స్ సినిమాల కోసం పనిచేసిన విఎఫ్ఎక్స్ టీం ని ఈ సినిమా కోసం అట్లీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ అల్లు అర్జున్ ను స్క్రీన్ టెస్ట్ చేసినట్లు కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతోందని అయితే మనకు అనౌన్స్మెంట్ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×