BigTV English
Advertisement

Allu Arjun : ఒక్క దెబ్బకి ఇంత మారిపోయాడు ఏంటి… గురువును బాగానే ఫాలో అవుతున్నాడే..

Allu Arjun : ఒక్క దెబ్బకి ఇంత మారిపోయాడు ఏంటి… గురువును బాగానే ఫాలో అవుతున్నాడే..

Allu Arjun : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఒకవైపు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ రోజు రోజుకు బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కానీ ఈ మూవీ ప్రీమియర్ షో టైం లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్ర గాయాలు కావడంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారణం అల్లు అర్జున్ అని పోలీసులు అరెస్ట్ చేశారు.. అల్లు అర్జున్ ఫిటీషన్ పై వాదనలు విన్న హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే వివాదాలు మాత్రం తగ్గలేదు.. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి మరో చర్చ నడుస్తుంది.


ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.. ఆ ఘటన కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది. పోలీసులు వద్దని చెప్పిన అల్లు అర్జున్ రోడ్ షో తో థియేటర్ వద్దకు చేరుకున్నాడు. సడెన్ గా హీరో రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే డిసెంబర్ 5 న థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కానీ పలు వీడియోస్ లో తాను ధరించిన డ్రెస్సుల పై కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో గొడ్డలి ఉన్న హూడి వేసుకోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి..

జైలు నుంచి విడుదలయ్యాక టాలీవుడ్ ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వచ్చినప్పుడు లైవ్ వీడియో పెట్టాడు. అప్పుడు కూడా బన్నీ తన బ్రాండ్ ను ప్రమోట్ చేసుకున్నాడు. వైట్ టీ షర్ట్ పై ఐకాన్ అని వేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే దీనిపై కూడా చాలా మంది బన్నీకి సపోర్ట్ గా మాట్లాడారు. అయితే లేటెస్ట్ గా మాత్రం అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పటి నుంచి ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.. రెండోసారి విచారణకు పోలీసు స్టేషన్ కు వెళ్లిన బన్నీ తన షర్ట్ పై కానీ, ఎక్కడా కానీ బ్రాండ్ పేరు గానీ పుష్ప 2 మూవీ గురించి కానీ ప్రమోట్ చేసేలా కనిపించలేదు. ఇక ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా ప్లైన్ టి షర్ట్స్‌లోనే కనిపించడం టాపిక్ గా మారింది.


ఇక ఇది కాకుండా సోషల్ మీడియాలో తన నుంచి ఏమన్నా అనౌన్సమెంట్ లు కానీ లేదా ఏవన్నా ప్రెస్ నోట్ లు అలాగే విషెస్ లాంటివి వచ్చినా తన అల్లు అర్జున్ లోగో AA అని వేసుకొనే వాడు కానీ ఇప్పుడు అది కూడా లేదు.. అది చూసిన ఫ్యాన్స్ బన్నీలో ఇంత మార్పేంటి అని ఆశ్చర్యపోతున్నారు.. ఈ గ్యాప్‌లోనే తనకి అంతలా ఏమయ్యిందా అని కూడా కొందరు మాట్లాడుకుంటే కారణం ఏదైనా ఈ మార్పు మంచిదే అని ఇంకొందరు అనుకుంటున్నారు. ఇలా మొత్తంగా అల్లు అర్జున్ ఇపుడు ఏది చేసినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే మారిపోతుంది అని చెప్పాలి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది.. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసేందుకు చేరువలో ఉంది. 1709 కోట్లు వసూల్ చేసింది. వచ్చే వారం వరకు ఈ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం 2వేల కోట్లు రాబట్టడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×