Sai Pallavi : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో వరస అవకాశాలు పట్టేస్తున్న హీరోయిన్లలో సాయి పల్లవి (Sai Pallavi) కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో సాయి పల్లవి ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు వదులుకుంది అనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
సాయి పల్లవి (Sai Pallavi) ఎంచుకునే కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంత పద్ధతిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అశ్లీలతకు ఏమాత్రం తావు లేకుండా, కెరీర్ మొదటి నుంచి సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు ఎంచుకుంటుంది సాయి పల్లవి. పద్ధతిగా ఉంటూనే తన యాక్టింగ్ తో శభాష్ అనిపిస్తుంది. అందుకే సాయి పల్లవికి మరే ఇతర హీరోయిన్లకు లేనివిధంగా క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈవెంట్లు అయినా, లేదంటే సినిమాలో అయినా మేకప్ లేకుండా నటించడం, భారతీయ వస్త్రధారణకు ప్రాధాన్యత నివ్వడం ఆమె ప్రత్యేకత. అంతేకాదు సాయి పల్లవి ఎంత కైండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
తనవల్ల ఒకరు బాధపడితే తట్టుకోలేను అని చెప్పిన సాయి పల్లవి (Sai Pallavi) ఓ డిజాస్టర్ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ లో నుంచి ఏకంగా 40 లక్షలు వదులుకుందట. సాధారణంగా సినిమాలు డిజాస్టర్ అయితే ఆ విషయం గురించి నటీనటులు పట్టించుకోరు. ఎవరో ఒకరిద్దరు తారలు తప్ప మిగతా వాళ్ళు నిర్మాతలకు సినిమా వల్ల వచ్చిన నష్టాన్ని ఏమాత్రం ఆలోచించరు. హీరోయిన్లు అయితే సినిమా చేశామా, రెమ్యూనరేషన్ తీసుకున్నామా అన్నట్టుగా ఉంటారు. కానీ గతంలో సాయి పల్లవి తాను నటించిన ‘పడి పడి లేచే మనసు’ (Padi Padi Leche Manasu) మూవీ కోసం తన రెమ్యునరేషన్లో నుంచి కొంత భాగాన్ని వదులుకుందట.
శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీలోని పాటలు హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ మూవీ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొక తప్పలేదు. అయితే అలాంటి టైంలోనే సాయి పల్లవి తన ఉదార స్వభావాన్ని బయట పెట్టింది. తను సైన్ చేసిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకోవడానికి నిరాకరించిందట. 40 లక్షలు త్యాగం చేసి, తన వైపు నుంచి నిర్మాతలకు అండగా నిలిచింది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా తన గురించి ఫేక్ వార్తలు ప్రసారం చేసినందుకు సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఇలాంటి వార్తలు ఆగడం లేదు.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ సినిమా, నాగ చైతన్యతో కలిసి ‘తండేల్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రీసెంట్ గా శివ కార్తికేయతో కలిసి ‘అమరన్’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఈ ఏడాది తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. వచ్చే ఏడాది ‘తండేల్’ రిలీజ్ కానుంది.