Allu Arjun.. అల్లు అర్జున్ (Allu Arjun)గత ఏడాది సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో చేసిన సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.ఎందుకంటే పుష్ప2 రిలీజ్ కి ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి జైల్లో కూడా ఒకరోజు గడిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన సరే ఒకసారి హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విషయం అటు అల్లు అర్జున్ నే కాదు ఆయన ఫ్యామిలీని కూడా మానసికంగా కృంగదీసింది. నిన్న మొన్నటి వరకు కూడా బన్నీ అదే బాధలో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న ఈయన కాస్త రిలాక్స్ అవుతున్నారు.
ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్న అల్లు అర్జున్..
ఈ క్రమంలో అల్లు అర్జున్ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. వారికి షాక్ ఇస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు అల్లు అర్జున్. అసలు విషయంలోకి వెళ్తే, అల్లు అర్జున్ , త్రివిక్రమ్(Trivikram ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుంది? అని అభిమానులు కూడా ఎదురు చూశారు. కానీ అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చారు బన్నీ. కొద్ది రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు కేసు, కోర్టులు , పోలీస్ స్టేషన్ అంటూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంతకాలం ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారట. అందుకే లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించి తాను కూడా రిలాక్స్ అవ్వాలని తిరిగి రెట్టింపు ఎనర్జీతో రావాలని ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తో మూవీ వాయిదా పడినట్టేనా.?
ఇక దీన్ని బట్టి చూస్తే.. ఒక ఆరు నెలలు బన్నీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ తర్వాతనే మళ్లీ త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాపై అల్లు అర్జున్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. పైగా అల్లు అర్జున్ కూడా ఎవరితో సినిమా చేసినా సరే బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒప్పుకుంటునట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మైథాలజికల్ ఫాంటసీ ఎలిమెంట్లతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారని, బన్నీ కూడా ఇందులో కొన్ని మార్పులు చేయించారని, దానిపై మాటల మాంత్రికుడు వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇక బన్నీ ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు కాబట్టి ఈ రిలాక్సింగ్ టైంలో త్రివిక్రమ్ తన పని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.