Kethireddy on Pawan: కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందా? మూడు పార్టీల మధ్య విభేదాలను సృష్టించే పనిలో పడిందా? ప్రజల ఆలోచనతో ఆడుకునేందుకు సిద్ధమైందా? కేవలం పవన్‌ని టార్గెట్‌గా చేసుకుని తెరవెనుక రాజకీయాలు చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య రిలేషన్ సవ్యంగానే సాగుతోంది. ప్రత్యర్థుల మాటలతో కేడర్ కాస్త సహనం కోల్పోయి నోరు ఎత్తిన సందర్భాలు వున్నాయి. అయితే నేతలు, కేడర్‌ను మందలించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా పార్టీలు.
కూటమి మధ్య విభేదాలు సృష్టించే పనిలో పడింది వైసీపీ. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ విజయసాయిరెడ్డి ద్వారా బయటకు చెప్పించింది వైసీపీ. సీఎం చంద్రబాబుకు వయసు అయిపోయిందని, యువకుడు పవన్ అయితే బాగా నడిపించగలరు అనే మాటలు చెప్పారు. వీఎస్ఆర్ మాటల లైన్‌ని కాసింత కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు వైసీపీ నేతలు.
లేటెస్ట్‌గా ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాదిరిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తొలి సక్సెస్ కొట్టారని మనసులోని మాట బయటపెట్టారు. కేవలం 21 సీట్లను మాత్రమే తీసుకుని 100 శాతం గెలిచారన్నారు.
ALSO READ: బొత్సపై వైసీపీ చర్చ.. ఉంటారా? వెళ్లిపోతున్నారు?
పవన్ లేకుంటే జగన్‌ను ఓడించడం టీడీపీ కష్టమనే అభిప్రాయాన్ని బయటపెట్టారు కేతిరెడ్డి. ఒకవిధంగా చెప్పాలంటే పవన్‌ని ఆశాకానికి ఎత్తేశారాయన. ఇదే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. పదేళ్లుపాటు సీఎంగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నానని అసెంబ్లీ సాక్షిగా పవన్ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ లెక్కన పవన్‌ను సీఎంగా చూసే ఛాన్స్ అభిమానులకు, వారికి కమ్యూనిటీ ప్రజలు కోరిక నెరవేరే అవకాశం లేదన్నారు కేతిరెడ్డి. అంటే ఇంకా పదేళ్లు పవన్ సీఎం కాలేరని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ఏపీలో ఏమైనా జరగొచ్చన్నారు. మహారాష్ట్రలో షిండే సీఎం అయిన విషయాన్ని గుర్తు చేశారాయన. రాజకీయాల్లో మూడు వ్యవస్థలతో కలిసి రాజకీయ క్రీడలు ఏ విధంగా ఆడవచ్చో బీజేపీ నిరూపించిందన్నారు. ఇదొక సక్సెస్ ఫార్ములాగా వర్ణించారు కేతిరెడ్డి.