Allu Arjun : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ టాక్ ను అందుకోవడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. డిసెంబర్ 5 న సినిమా గ్రాండ్ గా విడుదలైంది. రెండు రోజులు భారీగా కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 3 అనే మూవీ కూడా ఉందని యూనిట్ చెప్తున్నారు. అయితే ఈ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా రాబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి నుంచే మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాలి. కానీ ఆ సినిమాకు గ్యాప్ తీసుకోబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అసలు బన్నీ గ్యాప్ తీసుకోవడానికి కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. ఈ ఏడాది ‘గుంటూరుకారం’ తరవాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. బన్నీతో త్రివిక్రమ్ హిట్ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా చాలా హోప్స్ పెట్టుకొన్నాడు.. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అలానే కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. చాలా రోజులుగా సినిమా కథ పై కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీకి గ్యాప్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.. ఏప్రిల్, మే కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు జూన్ వరకూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే బన్నీ ఆరు ఏడు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
నిజానికి బన్నీ పుష్ప 2 చెమటలు చిందించాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రమోషన్స్ బాధ్యతలను ఒక్కడే తన భుజాల పై వేసుకున్నాడు. ప్రమోషన్ల కోసం బాగా తిరిగాడు. తనకు కాస్త విరామం కావాలి. కాకపోతే.. మరీ ఇన్ని నెలల గ్యాప్ అంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేలోగా మరో ప్రాజెక్ట్ పూర్తి చేసే టైమ్ కూడా లేదు. మరి అప్పటివరకు బన్నీ ఖాళీగా ఉండక తప్పదు. త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేలోగా మరో ప్రాజెక్ట్ పూర్తి చేసే టైమ్ కూడా బన్నీ చేతిలో లేదు. ఒకటి.. అటు త్రివిక్రమ్ స్పీడు పెంచి, షూటింగ్ కి రెడీ అవ్వాలి, లేదంటే మొదలయ్యేంత వరకూ ఖాళీగా కూర్చోవాలి. ఇక వచ్చే వారం బన్నీ ఫ్యామిలీ తో ట్రిప్ కు వెళ్ళనున్నాడని సమాచారం. ఆ తర్వాత కొత్త సినిమా కోసం కథలు వింటాడేమో చూడాలి. ఈ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా చెయ్యనున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మరి అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది. జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను చేస్తున్నారు.